Breaking News

ఆఫ్ఘనిస్తాన్‌ క్రికెట్‌లో పెను విషాదం

Published on Tue, 07/08/2025 - 13:39

ఆఫ్ఘనిస్తాన్‌ క్రికెట్‌లో విషాదం నెలకొంది. ఆ దేశ అంతర్జాతీయ అంపైర్‌ బిస్మిల్లా జన్‌ షిన్వారీ 41 ఏళ్ల యుక్త వయసులోనే ప్రాణాలు కోల్పోయాడు. తీవ్రమైన అనారోగ్యం కారణంగా షిన్వారీ మరణించినట్లు ఆఫ్ఘనిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు ఇవాళ (జులై 8) ప్రకటించింది. ఏసీబీ షిన్వారీ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేసింది. ఆఫ్ఘన్‌ క్రికెట్‌ గొప్ప సేవకుడిని కోల్పోయిందని విచారం వ్యక్తం చేస్తూ.. అతని కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపింది.

1984 మార్చిలో జన్మించిన షిన్వారీ 2017 డిసెంబర్‌లో అంతర్జాతీయ అంపైరింగ్ అరంగేట్రం చేశాడు. ఈ ఏడాది జనవరిలో జరిగిన ఐసీసీ పురుషుల క్రికెట్ ప్రపంచ కప్ లీగ్ 2 మ్యాచ్‌లో అతను చివరి సారి అంపైరింగ్‌ చేశాడు. షిన్వారీ తన కెరీర్‌లో 60 అంతర్జాతీయ మ్యాచ్‌లకు (34 వన్డేలు, 26 టీ20లు) అంపైర్‌గా వ్యవహరించాడు. షిన్వారీ తన అంపైరింగ్‌ జర్నీని ఐర్లాండ్‌, ఆఫ్ఘనిస్తాన్‌ వన్డే మ్యాచ్‌తో ప్రారంభించాడు.

బాంబు పేలుళ్ల నుంచి బయటపడి..!
షిన్వారీ 2020 అక్టోబర్‌లో నగర్హర్‌ ఫ్రావిన్స్‌లో జరిగిన బాంబు పేలుళ్లను బయటపడ్డాడు. ప్రాథమిక నివేదికల్లో షిన్వారీ మరియు అతని కుటుంబ సభ్యులు చాలా మంది మృతి చెందారని వార్తలు వచ్చాయి. అయితే అతనే స్వయంగా మీడియా ముందుకు వచ్చి  చనిపోలేదని నిర్ధారించాడు.

#

Tags : 1

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)