Breaking News

సిక్సర్‌ బాది.. గుండెపోటుతో కుప్పకూలి.. పిచ్‌పైనే ప్రాణాలొదిలి!

Published on Mon, 06/30/2025 - 12:08

పంజాబ్‌లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. స్థానిక క్రికెటర్‌ పిచ్‌పైనే ప్రాణాలొదిలాడు. ఉత్సాహంగా మ్యాచ్‌ ఆడుతున్న అతడు.. సిక్సర్‌ బాదిన వెంటనే గుండెపోటుతో కుప్పకూలాడు. ఆస్పత్రికి తీసుకువెళ్లేలోపే అతడు మరణించినట్లు సమాచారం.

మృతుడిని హర్జీత్‌ సింగ్‌గా గుర్తించారు. కాగా ఫిరోజ్‌పూర్‌లోని డీఏవీ పాఠశాల మైదానంలో రెండు జట్లు క్రికెట్‌ మ్యాచ్‌లో తలపడుతున్నాయి. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన హర్జీత్‌.. సిక్సర్‌తో అలరించాడు. అయితే, ఆ వెంటనే పిచ్‌ మధ్యలోకి వచ్చిన అతడు ఒక్కసారిగా కుప్పకూలాడు.

ఇంతలో సహచర ఆటగాళ్లు వచ్చి హర్జీత్‌ను పైకిలేపే ప్రయత్నం చేశారు. పరిస్థితిని గమనించి సీపీఆర్‌ (CPR- కార్డియోపల్మనరీ రిససిటేషన్‌) చేశారు. కానీ అప్పటికే అతడు స్పృహ కోల్పోయిన అతడిలో ఎలాంటి చలనం కనిపించలేదు. గుండెపోటు కారణంగా హర్జీత్‌ అక్కడిక్కడే మృతి చెందినట్లు తెలుస్తోంది.

సిక్సర్‌బాది ఆ వెంటనే 
కాగా సిక్సర్‌బాది ఆ వెంటనే అతడు కుప్పకూలిన దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారగా.. హర్జీత్‌ కుటుంబానికి నెటిజన్లు సానుభూతి తెలుపుతున్నారు. కాగా గతేడాది కూడా ఇలాంటి ఘటనే జరిగింది. 35 ఏళ్ల క్రికెటర్‌ ఒకరు పుణెలోని గర్వారే స్టేడియంలో మ్యాచ్‌ ఆడుతూనే గుండెపోటుకు గురయ్యాడు.

ఓపెనర్‌గా బ్యాటింగ్‌కు వచ్చిన ఇమ్రాన్‌ పటేల్‌ అనే వ్యక్తి కాసేపటికే ఛాతీలో నొప్పి వస్తుందని చెప్పి.. ఫీల్డ్‌ అంపైర్ల అనుమతితో మైదానాన్ని వీడాడు. కానీ పెవిలియన్‌ చేరేలోపే అతడు కుప్పకూలిపోయాడు. పూర్తి ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉన్నప్పటికీ అతడు గుండెపోటు కారణంగా మృతి చెందడం గమనార్హం. ఆల్‌రౌండర్‌ అయిన ఇమ్రాన్‌ మైదానంలో ఎంతో చురుగ్గా ఉండేవాడని.. దురదృష్టవశాత్తూ అతడిని కోల్పోయామని తోటి ఆటగాళ్లు, స్నేహితులు విచారం వ్యక్తం చేశారు.

Videos

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)