Breaking News

US Open 2025: అమెరికా స్టార్‌పై జాత్యహంకర వ్యాఖ్యలు..!? వీడియో వైరల్‌

Published on Thu, 08/28/2025 - 11:11

యూఎస్ ఓపెన్‌-2025లో జాత్యహంకార వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. అమెరికా క్రీడాకారిణి టేలర్‌ టౌన్‌సెండ్‌, లాట్వియన్ టెన్నిస్ స్టార్ జెలెనా ఒస్టాపెంకో మ‌ధ్య తీవ్ర‌మైన వాగ్వాదం చోటు చేసుకుంది. యూఎస్ ఓపెన్ మ‌హిళల సింగిల్స్‌లో ఆగ‌స్టు 27(బుధ‌వారం) టౌన్‌సెండ్‌, ఒస్టాపెంకో త‌ల‌ప‌డ్డారు.  ఈ రెండో రౌండ్ మ్యాచ్‌లో  25వ సీడ్ ఒస్టాపెంకోను 7-5, 6-1 తేడాతో టౌన్‌సెండ్‌ ఓడించింది.

అయితే 2017 ఫ్రెంచ్ ఓపెన్ ఛాంపియన్ అయిన ఒస్టాపెంకో..  టౌన్‌సెండ్ చేతిలో ఓట‌మిని జీర్ణించుకోలేక‌పోయింది. దీంతో మ్యాచ్ ముగిసినంత‌రం హ్యాండ్ షేక్ చేసే స‌మ‌యంలో టౌన్‌సెండ్‌పై వేలు చూపిస్తూ  ఒస్టాపెంకో జాత్యహంకర వ్యాఖ్యలు చేసింది. నీకు ఒక స్దాయి లేదు, స‌రైన చ‌దువు లేద‌ని త‌న‌ను దూషించిన‌ట్లు టౌన్‌సెండ్ ఓ ఇంట‌ర్వ్యూలో చెప్పుకొచ్చింది. 

హ‌ద్దులు మీరిన జెలెనా..
"ఒక పోటీలో ఓడిపోయిన‌ప్పుడు స‌హ‌జంగా ఎవ‌రైనా నిరాశ చెందుతారు. కానీ ఆ స‌మ‌యంలో కొంత మంది త‌మ హ‌ద్ద‌లు మీరి ప్ర‌వ‌ర్తిస్తారు. ఇప్పుడు ఒస్టాపెంకో నాతో అలానే ప్ర‌వ‌ర్తించింది. నాకు ఒక క్లాస్ లేదు, చ‌దువు లేద‌ని న‌న్ను విమ‌ర్శించింది.

యూఎస్ వెలుపుల‌ ఏమి జరుగుతుందో వెళ్లి చూడమని నన్ను హెచ్చరించింది" అని మ్యాచ్ అనంత‌రం ఆన్-కోర్ట్ ఇంటర్వ్యూలో టౌన్‌సెండ్‌ పేర్కొంది. దీంతో జెలెనాపై విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి. ఈ క్ర‌మంలో త‌న‌పై వ‌స్తున్న విమ‌ర్శ‌ల‌కు సోష‌ల్ మీడియా వేదిక‌గా ఒస్టాపెంకో కౌంటరిచ్చింది.

అందరిని గౌరవిస్తా..
"నా జీవితంలో నేను ఎప్పుడూ జాత్యహంకార వ్యాఖ్య‌లు చేయ‌లేదు. అన్ని దేశాల ప్రజలను నేను గౌరవిస్తాను. నాకు మీరు ఎక్క‌డి నుంచి వచ్చారన్నది ముఖ్యం కాదు. పోటీలో గెల‌వ‌డ‌మే నా లక్ష్య​ం అని  ఒస్టాపెంకో ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో రాసుకొచ్చింది. అయితే ఒస్టాపెంకో కోపం వెన‌క ఓ కార‌ణ‌ముందంట‌.  టెన్నిస్ మ్యాచ్ నియమాలకు విరుద్దంగా టౌన్‌సెండ్‌ ప్రవర్తించినట్లు ఒస్టాపెంకో ఆరోపించింది.

"మ్యాచ్ ప్రారంభంలో అందరు ఆటగాళ్లు బేస్‌లైన్‌లోనే వార్మప్ ప్రారంభించాలి. కానీ టౌన్‌సెండ్ మాత్రం బెస్‌లైన్‌లో కాకుండా  బయటకు వచ్చి వెంటనే వార్మప్ ప్రారంభించింది. టౌన్‌సెండ్ అలా చేయడం సరి  కాదు. ఆమె టెన్నిస్ మ్యాచ్ నియమాలకు విరుద్ధంగా వెళ్లింది. కనీసం నెట్‌కార్డ్‌ విన్నర్‌కు సారీ కూడా చెప్పలేదని ఒస్టాపెంకో తన పోస్ట్‌లో పేర్కొంది.



చదవండి: కోహ్లి, గిల్ కాదు.. అతడికి బౌలింగ్ చేయడం కష్టం: ఇంగ్లండ్‌ స్టార్‌ పేసర్‌

 

Videos

టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. లారెన్స్ బిష్ణోయ్ సంచలన ప్రకటన

వైఎస్సార్ జిల్లాలో ఉద్రిక్తత.. YSRCP ఛైర్మన్ అభ్యర్థి పోరెడ్డి ఇంటిపై టీడీపీ దాడి

జియో IPO సంచలనం

బాబుకు దిమ్మతిరిగేలా.. పక్కా ఆధారాలతో SECకి ఫిర్యాదు

రెండో టీ20లో భారత మహిళా జట్టు విజయం

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)