టీమిండియాపై సంచలన శతకం సాధించిన ఆటగాడిపై నిషేధం

Published on Sun, 04/27/2025 - 11:29

ఛాంపియన్స్‌ ట్రోఫీ-2025లో టీమిండియాపై సంచలన శతకం సాధించి వార్తల్లో నిలిచిన బంగ్లాదేశ్‌ మిడిలార్డర్‌ బ్యాటర్‌ తౌహిద్‌ హృదోయ్‌ నిషేధానికి గురయ్యాడు. ఢాకా ప్రీమియర్‌ లీగ్‌-2025లో ఓ మ్యాచ్‌ సందర్భంగా అంపైర్‌ నిర్ణయానికి వ్యతిరేకంగా స్పందించినందుకు అతడిపై నాలుగు మ్యాచ్‌ల సస్పెన్షన్ (8 డీమెరిట్‌ పాయింట్లతో పాటు) విధించబడింది. 

దీంతో హృదోయ్‌ ఈ సీజన్‌లో అబాహీనీ జట్టుతో జరిగే కీలక మ్యాచ్‌తో పాటు వచ్చే సీజన్‌లో తొలి మూడు మ్యాచ్‌లకు ​దూరం కానున్నాడు. హృదోయ్‌ ఢాకా ప్రీమియర్ లీగ్‌లో (DPL) మొహమ్మదెన్‌ ఫ్రాంచైజీకి ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఘాజీ గ్రూప్‌తో జరిగిన మ్యాచ్‌లో 54 బంతుల్లో 37 పరుగులు చేసి ఔటైన తర్వాత అంపైర్ నిర్ణయంపై  అసంతృప్తిని  వ్యక్తం చేశాడు.

24 ఏళ్ల హృదోయ్‌ ఛాంపియన్స్‌ ట్రోఫీ 2025లో టీమిండియాతో జరిగిన మ్యాచ్‌లో అద్భుత సెంచరీ చేశాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన బంగ్లాదేశ్‌ 35 పరుగులకే సగం​ వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉండగా హృదోయ్‌ సూపర్‌ సెంచరీతో (118 బంతుల్లో 100; 6 ఫోర్లు, 2 సిక్సర్లు) ఆదుకున్నాడు. జాకిర్‌ అలీతో (68) కలిసి ఆరో వికెట్‌కు 154 పరుగుల అమూల్యమైన భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. 

తద్వారా బంగ్లాదేశ్‌ గౌరవప్రదమైన స్కోర్‌ చేయగలిగింది. అనంతరం భారత్‌ సులువగా లక్ష్యాన్ని ఛేదించినా హృదోయ్‌ ఇన్నింగ్స్‌ అందరినీ ఆకట్టుకుంది. శుభ్‌మన్‌ గిల్‌ సూపర్‌ సెంచరీ (101 నాటౌట్‌) చేసి భారత్‌ను గెలిపించాడు. రోహిత్‌ శర్మ (41), కేఎల్‌ రాహుల్‌ (41 నాటౌట్‌) కీలకమైన ఇన్నింగ్స్‌లు ఆడారు. ఆ టోర్నీలో భారత్‌ ఫైనల్లో న్యూజిలాండ్‌పై విజయం సాధించి ఛాంపియన్‌గా నిలిచింది. ఈ టోర్నీకి పాక్‌ ఆతిథ్యమివ్వగా, భద్రతా కారణాల దృష్ట్యా భారత్‌ తమ మ్యాచ్‌లను దుబాయ్‌లో ఆడింది. 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)