Breaking News

ఒకేరోజు ఎనిమిది మంది క్రికెటర్ల ఎంట్రీ!

Published on Fri, 02/02/2024 - 15:23

క్రికెట్‌ చరిత్రలో అత్యంత అరుదైన ఘటన చోటు చేసుకుంది. వివిధ ఫార్మాట్లలో ఇవాళ (2024, ఫిబ్రవరి 2న) ఏకంగా ఎనిమిది మంది ఆటగాళ్లు అంతర్జాతీయ అరంగేట్రం చేశారు. ముందుగా విశాఖ వేదికగా జరుగుతున్న భారత్‌-ఇంగ్లండ్‌ టెస్ట్‌ మ్యాచ్‌ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌తో భారత ఆటగాడు రజత్‌ పాటిదార్‌, ఇంగ్లండ్‌ యువ స్పిన్నర్‌ షోయబ్‌ బషీర్‌ టెస్ట్‌ క్రికెట్‌ అరంగేట్రం చేశారు. 

వెస్టిండీస్‌తో ఇవాళ జరుగుతున్న వన్డే మ్యాచ్‌లో ఇద్దరు ఆస్ట్రేలియా ఆటగాళ్లు వన్డే అరంగేట్రం చేశారు. శ్రీలంకతో ఇవాళే మొదలైన ఏకైక టెస్ట్‌ మ్యాచ్‌లో ఏకంగా నలుగురు ఆఫ్ఘనిస్తాన్‌ ఆటగాళ్లు టెస్ట్‌ అరంగేట్రం చేశారు. మొత్తంగా ఇవాళ ఎనిమిది మంది ఆటగాళ్లు వివిధ ఫార్మాట్లలో అంతర్జాతీయ అరంగేట్రం చేశారు. క్రికెట్ చరిత్రలో ఇంతమంది ఒకే రోజు అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన దాఖలాలు దాదాపుగా లేవనే చెప్పాలి.

ఇవాళ అంతర్జాతీయ అరంగేట్రం చేసిన ఆటగాళ్ల వివరాలు..

  • రజత్‌ పాటిదార్‌ (భారత్‌)
  • షోయబ్‌ బషీర్‌ (ఇంగ్లండ్‌)
  • జేవియర్‌ బార్ట్‌లెట్‌ (ఆస్ట్రేలియా)
  • లాన్స్‌ మోరిస్‌ (ఆస్ట్రేలియా)
  • నూర్‌ అలీ జద్రాన్‌ (ఆఫ్ఘనిస్తాన్‌)
  • నవీద్‌ జద్రాన్‌ (ఆఫ్ఘనిస్తాన్‌)
  • జియా ఉర్‌ రెహ్మాన్‌ అక్బర్‌ (ఆఫ్ఘనిస్తాన్‌)
  • మొహమ్మద్‌ సలీం (ఆఫ్ఘనిస్తాన్‌)

ఇవాళ జరుగుతున్న మ్యాచ్‌ల విషయాని​కొస్తే.. ఇంగ్లండ్‌తో ఇవాళ మొదలైన రెండో టెస్ట్‌లో తొలుత బ్యాటింగ్‌ చేస్తున్న భారత్‌ టీ విరామం సమయానికి 3 వికెట్ల నష్టానికి 225 పరుగులు చేసింది. యశస్వి జైస్వాల్‌ (125 నాటౌట్‌) కెరీర్‌లో మూడో సెంచరీతో కదంతొక్కగా.. అతనికి జతగా అరంగేట్రం ఆటగాడు రజత్‌ పాటిదార్‌ (25) క్రీజ్‌లో ఉన్నాడు.  ఇంగ్లండ్‌ బౌలర్లలో ఆండర్సన్‌, టామ్‌ హార్ట్లీ, షోయబ్‌ బషీర్‌ తలో వికెట్‌ పడగొట్టారు. ఈ మ్యాచ్‌లో అరంగేట్రం ఆటగాళ్లు రజత్‌ పాటిదార్‌, షోయబ్‌ బషీర్‌  పర్వాలేదనిపించారు. 

ఆస్ట్రేలియా-వెస్టిండీస్‌ తొలి వన్డే విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా విజయానికి చేరువలో ఉంది. తొలుత బ్యాటింగ్‌ చేసిన విండీస్‌ 48.4 ఓవరల్లో 231 పరుగులకు ఆలౌట్‌ కాగా.. ఆస్ట్రేలియా 34 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 208 పరుగుల వద్ద ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తుంది. గ్రీన్‌ (68), స్టీవ్‌ స్మిత్‌ (65) క్రీజ్‌లో ఉన్నారు. ఆసీస్‌ గెలుపుకు మరో 24 పరుగులు మాత్రమే అవసరం ఉంది. అరంగేట్రం ఆటగాళ్లు జేవియర్‌ బార్ట్‌లెట్‌ (9-1-17-4) అద్భుత గణాంకాలతో విజృంభించగా.. లాన్స్‌ మోరిస్‌ (10-2-59-0) పర్వాలేదనిపించాడు. 

ఆఫ్ఘనిస్తాన్‌-శ్రీలంక మ్యాచ్‌ విషయానికొస్తే.. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేస్తున్న ఆఫ్ఘనిస్తాన్‌ తొలి రోజు మూడో సెషన్‌ సమయానికి 6 వికెట్ల నష్టానికి 177 పరుగులు (53 ఓవర్లు) చేసింది. కైస్‌ అహ్మద్‌ (16), జియా ఉర్‌ రెహ్మాన్‌ (0) క్రీజ్‌లో ఉన్నారు. అరంగేట్రం​ ఆటగాళ్లలో నూర​ జద్రాన్‌ (31) కాస్త పర్వాలేదనించాడు.  

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)