Breaking News

దులీప్‌ ట్రోఫీలో అగ్రశ్రేణి క్రికెటర్లు

Published on Thu, 08/15/2024 - 04:10

న్యూఢిల్లీ: బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌కు ముందు భారత దేశవాళీ క్రికెట్‌ సీజన్‌ దులీప్‌ ట్రోఫీతో మొదలుకానుంది. వచ్చేనెల 5 నుంచి బెంగళూరు, అనంతపురంలో ఈ టోర్నీ జరగనుంది. దీనికోసం జాతీయ సెలెక్షన్‌ కమిటీ బుధవారం నాలుగు జట్లను ప్రకటించింది. శుబ్‌మన్‌ గిల్, అభిమన్యు ఈశ్వరన్, రుతురాజ్‌ గైక్వాడ్, శ్రేయస్‌ అయ్యర్‌ వరుసగా ‘ఎ’ ‘బి’ ‘సి’ ‘డి’ జట్లకు కెప్టెన్‌లుగా వ్యవహరిస్తారు. 

పనిభారాన్ని   దృష్టిలో పెట్టుకొని స్టార్‌ ఆటగాళ్లు రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లి, బుమ్రా, అశి్వన్‌లకు ఈ టోర్నీ నుంచి విశ్రాంతి ఇచ్చారు. శస్త్రచికిత్స తర్వాత పూర్తిగా కోలుకోని సీనియర్‌ పేసర్‌ షమీని కూడా ఎంపిక చేయలేదు. ఇక కారు ప్రమాదం నుంచి కోలుకున్న రిషబ్‌ పంత్‌ చాలా రోజులకు ఎర్రబంతితో ఆడనున్నాడు. 

గత సీజన్‌లో రంజీ ట్రోఫీ ఆడకుండా.. ఐపీఎల్‌పై దృష్టి పెట్టి సెంట్రల్‌ కాంట్రాక్టు కోల్పోయిన ఇషాన్‌ కిషన్‌ టీమ్‌ ‘డి’లో చోటు దక్కించుకున్నాడు. సెపె్టంబర్‌ 19 నుంచి భారత్, బంగ్లాదేశ్‌ మధ్య రెండు టెస్టుల సిరీస్‌ ప్రారంభమవుతుంది.  టీమిండియా ఆటగాళ్లు దులీప్‌ ట్రోఫీ తొలి రౌండ్‌ మ్యాచ్‌లో మాత్రమే ఆడే అవకాశాలున్నాయి. 

ఆంధ్రప్రదేశ్‌కు చెందిన యువ ఆల్‌రౌండర్‌ నితీశ్‌ కుమార్‌ రెడ్డిని ‘బి’ జట్టుకు ఎంపిక చేశారు. హైదరాబాద్‌ ఆటగాళ్లు సిరాజ్‌ ‘బి’ జట్టులో చోటు పొందగా.. తిలక్‌ వర్మ ‘ఎ’ జట్టులో ఉన్నాడు. ఆంధ్ర ఆటగాళ్లు శ్రీకర్‌ భరత్, రికీ భుయ్‌ టీమ్‌ ‘డి’లో చోటు దక్కించుకున్నారు.   
 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)