Breaking News

టెస్టుల్లో అత్యధిక LBW వికెట్లు తీసింది ఎవ‌రంటే..?

Published on Mon, 06/30/2025 - 16:16

క్రికెట్‌లో పొట్టి ఫార్మాట్ అభిమానులను ఊర్రూత‌లూగిస్తున్నా టెస్ట్ క్రికెట్ ప్రాధాన్య‌త ఏమాత్రం త‌గ్గ‌లేదు. ఇప్ప‌టికీ సిస‌లైన క్రికెట్‌గా టెస్టులను ప‌రిగ‌ణిస్తున్నారంటే.. లాంగ్ ఫార్మాట్ స‌త్తా ఏపాటిదో మ‌న‌కు అర్థ‌మ‌వుతుంది. ప్ర‌స్తుతం భార‌త్‌, ఇంగ్లండ్ జ‌ట్ల మ‌ధ్య టెస్ట్ సిరీస్ న‌డుస్తోంది. శుబ్‌మ‌న్ గిల్ నాయ‌క‌త్వంలోని టీమిండియా మొదటి మ్యాచ్‌లో ప‌రాజ‌యం చ‌విచూసింది. ఇంకా 4 మ్యాచ్‌లు జ‌ర‌గాల్సివుంది. చూద్దాం టీమిండియా ఏం చేస్తుందో.

అద‌లావుంచితే టెస్ట్ క్రికెట్‌లో అత్యధికంగా ఎల్బీడ‌బ్ల్యూ వికెట్లు సాధించిన బౌల‌ర్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. లెగ్ బిఫోర్ వికెట్ (leg before wicket) సంక్షిప్త నామ‌మే ఎల్బీడ‌బ్ల్యూ. ప‌టిష్ట‌మైన లైన్, లెంగ్త్‌తో యార్క‌ర్లు సంధించి వికెట్ల ముందు బ్యాట‌ర్లను దొర‌క‌బుచ్చుకోవ‌డం అద్భుతమైన కళ. ఎందరో దిగ్గ‌జ బౌల‌ర్లు ఈ క‌ళ‌లో ప్రావీణ్యం సంపాదించి త‌మ జాతీయ జ‌ట్ల విజ‌యాల్లో కీల‌క‌పాత్ర పోషించారు. బ్యాట‌ర్లు క్రీజులో పాతుకుపోయి క్యాచ‌వుట్లు, వికెట్లు ఇవ్వ‌డానికి ఇష్ట‌ప‌డ‌ని సంద‌ర్భంలో బౌల‌ర్లు ఎక్కువ‌గా యార్క‌ర్లు సంధిస్తూ ఎల్బీడ‌బ్ల్యూ కోసం ప్ర‌య‌త్నిస్తుంటారు.

నంబ‌ర్ 1 మ‌నోడే
టెస్ట్ క్రికెట్‌లో అత్యధికంగా ఎల్బీడ‌బ్ల్యూ వికెట్లు సాధించిన బౌల‌ర్లలో మ‌నోడే ముందున్నాడు. 'జంబో'గా ప్ర‌సిద్ధుడైన టీమిండియా స్పిన్ దిగ్గ‌జం అనిల్ కుంబ్లే (Anil Kumble) అందరికంటే ఎక్కువ‌గా 156  ఎల్బీడ‌బ్ల్యూ వికెట్లు ద‌క్కించుకుని టాప్‌లో నిలిచాడు. 132 టెస్టులు ఆడిన అత‌డు మొత్తం 619 వికెట్లు ప‌డ‌గొట్టాడు. కుంబ్లే లెగ్ బ్రేక్ గూగ్లీ బౌలింగ్, అత‌డి నిబ‌ద్ద‌త గురించి క్రికెట్ అభిమానులందరికీ బాగా తెలుసు. అందుకే ఇప్ప‌టికీ టెస్టుల్లో అత్య‌ధిక వికెట్లు ప‌డ‌గొట్టిన ఇండియ‌న్ బౌల‌ర్‌గా కుంబ్లేనే కొన‌సాగుతున్నాడు.

ముత్త‌య్య @ 150
టెస్టుల్లో అత్య‌ధిక వికెట్లు ప‌డ‌గొట్టిన శ్రీలంక లెజెండ‌రీ బౌల‌ర్ ముత్త‌య్య ముర‌ళీధ‌ర‌న్ (Muttiah Muralitharan) ఈ జాబితాలో రెండో స్థానంలో ఉన్నాడు. 150 ఎల్బీడ‌బ్ల్యూ వికెట్లు అత‌డి ఖ‌తాలో ఉన్నాయి. 133 టెస్టులు ఆడిన ముర‌ళీధ‌ర‌న్ ఓవ‌రాల్‌గా 800 వికెట్లు సాధించి ఎవ‌రికీ అంద‌నంత ఎత్తులో నిలిచాడు. అత‌డి జీవిత క‌థ‌ ఆధారంగా త‌మిళంలో '800' పేరుతో సినిమా కూడా వ‌చ్చింది.

వారెవా.. వార్న్
ఆస్ట్రేలియా స్పిన్ దిగ్గ‌జం షేన్ వార్న్ (Shane Warne) 138 ఎల్బీడ‌బ్ల్యూ వికెట్లు సాధించాడు. స్లైడ‌ర్‌, ఫ్లిప్ప‌ర్‌, గూగ్లీల‌తో బ్యాట‌ర్ల‌ను బోల్తా కొట్టించ‌డంలో చేయి తిరిగిన వార్న్‌.. త‌న కెరీర్‌లో 145 టెస్ట్ మ్యాచ్‌లు ఆడి 708 వికెట్లు ప‌డ‌గొట్టాడు. అత్య‌ధిక ఎల్బీడ‌బ్ల్యూ వికెట్లు సాధించిన బౌల‌ర్లో మొద‌టి మూడు స్థానాల్లోనూ స్పిన్న‌ర్లే నిల‌వ‌డం విశేషం.

చ‌ద‌వండి: రెండో టెస్ట్‌లో అత‌డిని త‌ప్ప‌కుండా ఆడించండి.. ఎందుకంటే?

119 ఎల్బీడ‌బ్ల్యూ వికెట్లు తీసిన పాకిస్థాన్ దిగ్గ‌జ బౌల‌ర్ వ‌సీం అక్రం (Wasim Akram) ఈ జాబితాలో 4వ స్థానంలో నిలిచాడు. టీమిండియా స్పిన్న‌ర్‌ ర‌విచంద్ర‌న్ అశ్విన్ 117 ఎల్బీడ‌బ్ల్యూ వికెట్లుతో 5వ స్థానంలో ఉన్నాడు. గ్లెన్ మెక్‌గ్రాత్ (113), క‌పిల్ దేవ్ (111), వ‌కార్ యూనిస్ (110), రంగన హెరాత్ (108), స్టువ‌ర్ట్ బ్రాడ్ (101) టాప్ టెన్‌లో ఉన్న మిగతా బౌల‌ర్లు. టెస్ట్ క్రికెట్ చరిత్రలో అత్యధిక LBW వికెట్లు తీసిన టాప్ 10 బౌలర్లలో ఐదుగురు స్పిన్న‌ర్లు, ఐదుగురు ఫాస్ట్ బౌల‌ర్లు ఉన్నారు. ఈ 10 మంది బౌల‌ర్లు టెస్ట్ క్రికెట్‌లో త‌మ‌దైన ముద్ర వేసి ఔత్స‌హిక బౌల‌ర్ల‌కు ప్రేర‌ణ‌గా నిలిచిన వారే. 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)