కుర్రాడి పట్ల నిర్లక్ష్యంగా ప్రవర్తించిన వాషింగ్టన్‌ సుందర్‌

Published on Fri, 01/02/2026 - 19:43

టీమిండియాలో అప్‌ కమింగ్‌ ఆల్‌రౌండర్‌గా పేరు తెచ్చుకున్న వాషింగ్టన్‌ సుందర్‌.. మైదానం వెలుపల తన ప్రవర్తన కారణంగా నెటిజన్ల ఆగ్రహానికి బలయ్యాడు. సుందర్‌ తాజాగా ఓ హోటల్‌ నుంచి బయటికి వస్తూ ఓ కుర్రాడు ఆటోగ్రాఫ్‌ అడిగితే నిర్లక్ష్యంగా నిరాకరించాడు. 

అలాగే కొందరు ఫ్యాన్స్‌ సెల్ఫీల కోసం ప్రయత్నిస్తున్నా పట్టీపట్టనట్లు వ్యవహరించాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరలవుతుంది.

ఇది చూసి నెటిజన్లు సుందర్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నావు.. ఏంటా బలుపు అంటూ దుమ్మెత్తిపోస్తున్నారు. ఇంకొందరేమో నువ్వేమైనా విరాట్‌ కోహ్లి లేదా రోహిత్‌ శర్మ అనుకుంటున్నావా అంటూ ఘాటుగా విమర్శిస్తున్నారు. 

మొత్తానికి ఆన్‌ ఫీల్డ్‌ ప్రదర్శనలతో అభిమానులను ఆకట్టుకున్న సుందర్‌, ఆఫ్‌ ద ఫీల్డ్‌ ప్రవర్తన కారణంగా అదే అభిమానుల నుంచి ఛీత్కారాలు ఎదుర్కొంటున్నాడు.

ఇదిలా ఉంటే, ఇటీవలి ఇంగ్లండ్‌, ఆస్ట్రేలియా పర్యటనల్లో ఫార్మాట్లకతీతంగా రాణించిన సుందర్‌..త్వరలో న్యూజిలాండ్‌తో జరుగబోయే హోం టీ20 సిరీస్‌కు సిద్దమవుతున్నాడు. న్యూజిలాండ్‌ సిరీస్‌కు ఎంపికైన జట్టే టీ20 ప్రపంచకప్‌లో కూడా కొనసాగనున్న విషయం తెలిసిందే. ఇటీవలి కాలంలో ప్లేయింగ్‌ ఎలెవెన్‌లో  స్థానాన్ని పక్కా చేసుకున్న సుందర్‌.. ప్రపంచకప్‌లో ఆడటం​ లాంఛనమే.

న్యూజిలాండ్‌తో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ జనవరి 21 నుంచి ప్రారంభం​ కానున్న విషయం తెలిసిందే. ఈ సిరీస్‌ కోసం భారత జట్టును ఇటీవలే ప్రకటించారు. ఐదు టీ20లు జనవరి 21, 23, 25, 28, 31 తేదీల్లో నాగ్‌పూర్‌, రాయ్‌పూర్‌, గౌహతి, వైజాగ్‌, తిరువనంతపురం వేదికలుగా జరుగనున్నాయి. 

ఈ సిరీస్‌కు ముందే ఇరు జట్ల మధ్య మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ కూడా జరుగనుంది. ఈ సిరీస్‌ జనవరి 11 నుంచే మొదలవుతుంది. ఈ సిరీస్‌ కోసం వన్డే జట్టును ప్రకటించాల్సి ఉంది.

 

Videos

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)