Breaking News

ర‌హీమ్, లిట్ట‌న్ దాస్ సెంచ‌రీలు.. బంగ్లాదేశ్ భారీ స్కోర్‌

Published on Thu, 11/20/2025 - 14:31

మిర్పూర్ వేదిక‌గా ఐర్లాండ్‌తో జ‌రుగుతున్న రెండో టెస్టులో బంగ్లాదేశ్ బ్యాట‌ర్లు అద‌ర‌గొట్టారు. ముష్ఫికర్ రహీమ్(214 బంతుల్లో 5 ఫోర్ల సాయంతో 106), లిట్టన్‌ దాస్‌(192 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్స్‌లతో 128) సెంచరీలతో కదం తొక్కారు. ఫలితంగా బంగ్లా జట్టు తమ తమ తొలి ఇన్నింగ్స్‌లో 476 పరుగుల భారీ స్కోర్ చేసి ఆలౌటైంది. 

రెండో రోజు ఆరంభంలో సెంచరీ చేసిన అనంతరం రహీమ్ పెవిలియన్‌కు చేరాడు. రహీమ్‌కు ఇది తన కెరీర్‌లో వందో టెస్టు కావడం విశేషం. వందో టెస్టులో సెంచరీ చేసిన 11వ ఆటగాడిగా రహీమ్ రికార్డులకెక్కాడు. ముష్ఫికర్ ఔటైన తర్వాత లిట్టన్ దాస్ దూకుడుగా ఆడి తన ఐదవ టెస్టు సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు.

వీరిద్దరితో పాటు మోమినుల్‌ హక్‌ (128 బంతుల్లో 63; 1 ఫోర్‌), హసన్‌ జాయ్‌ (34), షాద్‌మన్‌ ఇస్లామ్‌ (35) ఫర్వాలేదనిపించారు. . కెప్టెన్‌ నజ్ముల్‌ హసన్‌ షంటో (8) విఫలమయ్యాడు. ఐర్లాండ్‌ బౌలర్లలో ఆండీ మెక్‌బ్రినె 6 వికెట్లు పడగొట్టగా.. మాథ్యూ హంఫ్రీస్, గావిన్ హోయ్ తలా రెండు వికెట్లు సాధించారు. కాగా తొలి టెస్టులో ఐర్లాండ్‌ను ఇన్నింగ్స్ తేడాతో బంగ్లా చిత్తు చేసిన సంగతి తెలిసిందే.
చదవండి: యువరాజ్ ఒంటరి పోరాటం.. భారత్‌ను చిత్తు చేసిన అఫ్గాన్‌

Videos

రోడ్డుపై స్కూటర్ ఆపి.. హెల్మెట్ తో దాడి..! మాజీ ఎమ్మెల్యే రౌడీయిజం వైరల్

ప్లాన్ "B" లోడింగ్..! కొండా సురేఖ సంచలన పోస్ట్

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Konda Surekha: నన్ను తీయడం వల్ల వాళ్లకే నష్టం

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

మళ్లీ ఢిల్లీకి రేవంత్.. మంత్రుల్లో కొత్త టెన్షన్!

10 ఏళ్లలో 82% పనులు..!వెలిగొండపై YSR-జగన్ కు ఘనత

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు