టామ్‌ బాంటన్‌ విధ్వంసకర శతకం.. ముంబై ఇండియన్స్‌ ఘన విజయం

Published on Tue, 01/28/2025 - 13:11

దుబాయ్‌ వేదికగా జరుగుతున్న ఇంటర్నేషనల్‌ లీగ్‌ టీ20 టోర్నీలో ముంబై ఇండియన్స్‌ ఎమిరేట్స్‌ ఆటగాడు టామ్‌ బాంటన్‌ చెలరేగిపోతున్నాడు. డెజర్ట్‌ వైపర్స్‌తో నిన్న (జనవరి 27) జరిగిన మ్యాచ్‌లో బాంటన్‌ విధ్వంసకర శతకం బాదాడు. ఫలితంగా ముంబై ఇండియన్స్‌ ఎమిరేట్స్‌ 154 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఎంఐ ఎమిరేట్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 228 పరుగుల రికార్డు స్కోర్‌ చేసింది. ఇంటర్నేషనల్‌ లీగ్‌ టీ20 చరిత్రలో ఇది రెండో అత్యధిక టీమ్‌ స్కోర్‌. ఈ మ్యాచ్‌లో వన్‌డౌన్‌లో వచ్చిన టామ్‌ బాంటన్‌ 55 బంతుల్లో 9 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 105 పరుగులు చేశాడు. 

ఓపెనర్‌ ఆండ్రీ ఫ్లెచర్‌ 50 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 96 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. బాంటన్‌, ఫ్లెచర్‌ రెండో వికెట్‌కు 198 పరుగుల రికార్డు భాగస్వామ్యం నమోదు చేశారు. యూఏఈ గడ్డపై టీ20ల్లో ఏ వికెట్‌కైనా ఇదే అత్యధిక భాగస్వామ్యం.

229 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన డెజర్ట్‌ వైపర్స్‌.. ఎంఐ ఎమిరేట్స్‌ బౌలర్ల ధాటికి 12.3 ఓవర్లలో 74 పరుగులకే కుప్పకూలింది. ముహమ్మద్‌ రోహిద్‌  ఖాన్‌, అల్జరీ జోసఫ్‌ తలో మూడు.. ఫజల్‌ హక్‌ ఫారూఖీ, డాన్‌ మౌస్లీ చెరో రెండు వికెట్లు పడగొట్టి వైపర్స్‌ ఇన్నింగ్స్‌ను నేలమట్టం చేశారు. 

వీరి దెబ్బకు వైపర్స్‌ ఇన్నింగ్స్‌లో ఒక్క ఆటగాడు కూడా కనీసం 15 పరుగులు చేయలేకపోయాడు. కెప్టెన్‌ సామ్‌ కర్రన్‌ (11), వికెట్‌కీపర్‌ ఆజమ్‌ ఖాన్‌ (12) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. ఈ మ్యాచ్‌లో ఓడినప్పటికీ వైపర్స్‌ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతుంది. 8 మ్యాచ్‌ల్లో 6 విజయాలు సాధించిన వైపర్స్‌ ఇదివరకే ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించింది.

రెండో శతకం
ఈ సీజన్‌లో టామ్‌ బాంటన్‌కి ఇది రెండో శతకం. ఇంటర్నేషనల్‌ లీగ్ టీ20 చరిత్రలో ఒకే సీజన్‌లో రెండు సెంచరీలు ఎవరూ చేయలేదు. తాజా శతకంతో బాంటన్‌ ఈ సీజన్‌ లీడింగ్‌ రన్‌స్కోరర్‌గా నిలిచాడు. బాంటన్‌ ఈ సీజన్‌లో ఇప్పటివరకు 8 మ్యాచ్‌లు ఆడి 156.36 స్ట్రయిక్‌రేట్‌తో 369 పరుగులు చేశాడు. ఈ సీజన్‌లో బాంటన్‌తో పాటు దుబాయ్‌ క్యాపిటల్స్‌ ఆటగాడు షాయ్‌ హోప్‌ ఒక్కడే సెంచరీ చేశాడు. 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)