Breaking News

నేడు అండర్‌–19 మహిళల ఆసియాకప్‌ ఫైనల్‌ – బంగ్లాదేశ్‌తో భారత్‌ ఢీ

Published on Sun, 12/22/2024 - 04:00

ఆసియాకప్‌ అండర్‌–19 మహిళల టి20 క్రికెట్‌ టోర్నమెంట్‌ ఫైనల్లో యువ భారత జట్టు బరిలోకి దిగనుంది. ఈ టోర్నీలో అజేయంగా నిలిచిన భారత జట్టు ఆదివారం కౌలాలంపూర్‌లో జరగనున్న తుది పోరులో బంగ్లాదేశ్‌తో అమీతుమీకి సిద్ధమైంది. 

నిక్కీ ప్రసాద్‌ సారథ్యంలోని భారత జట్టు ‘సూపర్‌ ఫోర్‌’ చివరి మ్యాచ్‌లో శ్రీలంకపై విజయంతో ఫైనల్‌కు అర్హత సాధించగా... మరోవైపు బంగ్లాదేశ్‌ ఈ టోర్నీ లో ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో నాలుగింట గెలిచి తుది పోరుకు చేరింది. అటు బౌలింగ్, ఇటు బ్యాటింగ్‌లో సమష్టిగా రాణిస్తున్న యువ భారత జట్టు... ఆఖరి సమరంలోనూ అదే జోరు కొనసాగించాలని భావిస్తోంది. 

ఆసియా క్రికెట్‌ కౌన్సిల్‌ (ఏసీసీ) తొలిసారి నిర్వహిస్తున్న ఈ టోర్నీ కి మలేసియా ఆతిథ్యమిస్తోంది. జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న తెలంగాణ అమ్మాయి గొంగడి త్రిష ఫుల్‌ ఫామ్‌లో ఉండగా... కెపె్టన్‌ నిక్కీ ప్రసాద్, కమలిని, మిథిల, ఐశ్వరి కూడా మంచి టచ్‌లో ఉన్నారు. ఇక బౌలింగ్‌లో ఆయుషి శుక్లా, షబ్నమ్, పరుణిక, ధ్రుతి కీలకం కానున్నారు. 

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)