Breaking News

ఇక వన్డే సమరం

Published on Fri, 08/02/2024 - 03:41

కొలంబో: ఓ పరిమిత ఓవర్ల సమరాన్ని వైట్‌వాష్‌ చేసిన భారత జట్టు ఇప్పుడు రెట్టించిన ఉత్సాహంతో మరో ఫార్మాట్‌నూ క్లీన్‌స్వీప్‌ చేసేందుకు సిద్ధమైంది. ఆతిథ్య శ్రీలంకతో శుక్రవారం నుంచి మూడు వన్డేల సిరీస్‌ ఆరంభమవుతోంది. పొట్టి ఫార్మాట్‌లో సూర్యకుమార్, కొత్త కోచ్‌ గౌతమ్‌ గంభీర్‌ కాంబినేషన్‌ విజయవంతమైంది. ఇప్పుడు రోహిత్‌–గంభీర్‌ల వంతు వచ్చి0ది. తొలి మ్యాచ్‌లో శుభారంభం చేయడం ద్వారా సిరీస్‌పై పట్టుసాధించాలని టీమిండియా భావిస్తోంది. 

టి20 ప్రపంచకప్‌ విజయానంతరం రోహిత్, కోహ్లి ఆడుతున్న తొలి సిరీస్‌ ఇదే. వీరిద్దరి రాకతో పెరిగిన బ్యాటింగ్‌ బలం భారత జైత్రయాత్రకు కచ్చితంగా దోహదం చేస్తుందనడంలో అతిశయోక్తి లేదు. మరోవైపు సొంతగడ్డపై మూడు టి20ల్లో ఓడిన శ్రీలంక జట్టు కనీసం వన్డే ఫార్మాట్‌లోనైనా పుంజుకోవాలని ఆశిస్తోంది. మారిన ఫార్మాట్‌లో ఓటమి రాతను మార్చుకోవాలని గంపెడాశలతో బరిలోకి దిగుతోంది.  

రోహిత్, కోహ్లి చేరడంతో... 
భారత టాప్‌స్టార్లు రోహిత్‌ శర్మ, కోహ్లిలు లేని భారత జట్టు టి20 ఫార్మాట్‌లో క్లీన్‌స్వీప్‌ చేసింది. ఆఖరి పోరు అయితే హైలైట్‌! ఓటమి కోరల్లోంచి సూపర్‌ విజయం దాకా సూర్యకుమార్‌ సేన పోరాటం ఆకట్టుకుంది. అలాంటి జట్టుకు ఇప్పుడు రోహిత్, కోహ్లిలు కలవడంతో బ్యాటింగ్‌ దుర్బేధ్యంగా మారింది. దీంతో 20 ఓవర్లకే ఆపసోపాలు పడిన లంక బౌలర్లకు వన్డేల్లో మరింత కష్టాలు తప్పవేమో! 

హార్దిక్, సూర్య వన్డే జట్టులో లేకపోవడంతో హిట్టర్లు దూబే, పరాగ్‌కు లక్కీ చాన్స్‌ కానుంది. మూడు వన్డేల్లో వీరిలో ఎవరికి ఎక్కువ అవకాశాలొస్తాయో చూడాలి. భారత్‌ ఇద్దరు స్పిన్నర్లు అక్షర్, కుల్దీప్‌లతో పాటు ముగ్గురు పేసర్ల తో బరిలోకి దిగాలనుకుంటే ఖలీల్‌ అహ్మద్‌ లేదంటే హర్షిత్‌ రాణాల్లో ఒకరు సిరాజ్, అర్ష్‌దీప్‌లతో బంతిని పంచుకుంటారు.  

అయ్యో... కష్టాల లంక! 
టి20 ఫార్మాట్‌లో చేతులెత్తేసిన శ్రీలంక ఇప్పుడు వన్డేల్లో అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. గత సిరీస్‌ ఫలితాన్ని పక్కనబెట్టి కొత్త ఫార్మాట్‌ను తాజాగా ఆరంభించాలనుకుంటుంది. ఓపెనర్లు నిసాంక, కుశాల్‌ మెండీస్‌ ఫామ్‌లో ఉన్నప్పటికీ... తర్వాత బ్యాటింగ్‌ ఆర్డర్‌లో వచ్చేవారిలో కెప్టెన్‌ చరిత్‌ అసలంక సహా ఎవరికి నిలకడే లేదు. ఇదే లంక బ్యాటింగ్‌ దళానికి శాపంగా మారింది. ఇప్పుడున్న కష్టాలు చాలవన్నట్లు వన్డేలకు ముందు గాయాల బెడద లంకను పీడిస్తోంది. 

50 ఓవర్ల మ్యాచ్‌లకు కీలకమైన పేసర్లు పతిరణ, మదుషంక గాయాల కారణంగా దూరమయ్యారు. ఆఖరి టి20లో క్యాచ్‌ కోసం డైవ్‌ చేసిన పతిరణ కుడి మోచేతికి గాయమైంది. ఫీల్డింగ్‌ ప్రాక్టీస్‌లో మదుషంక ఎడమకాలి తొడ కండరాలు పట్టేయడంతో ఇద్దరు మొత్తం వన్డే సిరీస్‌కే అందుబాటులో లేకుండా పోయారు. ఇలాంటి పరిస్థితుల్లో భారత్‌ను ఎదుర్కోవడమంటే ఏటికి ఎదురీదడమే తప్ప ఏమాత్రం సులువు కానేకాదు. 

పిచ్, వాతావరణం 
బ్యాటింగ్‌కు అనుకూలమైన పిచ్‌. భారీస్కోరు ఆశించొచ్చు. అలాగే స్పిన్నర్లకు తిప్పేసే చాన్స్‌ ఉంది. కానీ మ్యాచ్‌కు శుక్రవారం వానముప్పు ఉంది. రోజంతా భారీవర్షం కురిసే అవకాశముందని స్థానిక వాతావరణ శాఖ తెలిపింది. 

జట్లు (అంచనా) 
భారత్‌: రోహిత్‌ (కెప్టెన్ ), గిల్, కోహ్లి, అయ్యర్, కేఎల్‌ రాహుల్‌/పంత్, దూబే/ పరాగ్, కుల్దీప్, అక్షర్, సిరాజ్, అర్‌‡్షదీప్, హర్షిత్‌. 
శ్రీలంక: అసలంక (కెప్టెన్ ), నిసాంక, కుశాల్‌ మెండీస్, సమరవిక్రమ, కమిండు, జనిత్, కురణరత్నే, హసరంగ, తీక్షణ, షిరాజ్‌/ఇషాన్‌ మలింగ, ఫెర్నాండో.  

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)