Viral Video: వింత పద్ధతిలో ఔటయ్యాడు.. సిక్స్‌ కొట్టి..!

Published on Wed, 07/26/2023 - 12:45

కౌంటీ ఛాంపియన్‌షిప్‌ 2023 డివిజన్‌ వన్‌ పోటీల్లో భాగంగా వార్విక్‌షైర్‌తో నిన్న (జులై 25) మొదలైన మ్యాచ్‌లో మిడిల్‌సెక్స్ కెప్టెన్ టోబీ రోలాండ్ జోన్స్ వింత పద్ధతిలో ఔటయ్యాడు. ఎడ్‌ బెర్నార్డ్‌ బౌలింగ్‌లో తాను ఎదుర్కొన్న 15వ బంతిని సిక్సర్‌గా మలిచిన టోబీ.. అదే బంతికి హిట్ వికెట్‌గా వెనుదిరిగాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరలవుతుంది. టోబీ అంత దురదృష్టవంతుడు మరొకరు ఉండరని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

ఈ ఇన్నింగ్స్‌లో మొత్తం 15 బంతులు ఎదుర్కొన్న టోబీ 2 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 21 పరుగులు చేసి పెవిలియన్‌కు చేరాడు. అనంతరం అతని జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 199 పరుగులకు ఆలౌటైంది. మిడిల్‌సెక్స్‌ ఇన్నింగ్స్‌లో ర్యాన్‌ హిగ్గిన్స్‌ (53) టాప్‌ స్కోరర్‌గా నిలువగా.. వార్విక్‌ బౌలర్లు డాల్బీ, హమ్జా, బర్నార్డ్‌ తలో 3 వికెట్లు, బ్రూక్స్‌ ఓ వికెట్‌ పడగొట్టాడు.

ఆ వెంటనే సెకెండ్‌ ఇన్నింగ్స్‌ ప్రారంభించిన వార్విక్‌షైర్‌.. తొలి రోజు ఆట ముగిసే సమయానికి 2 వికెట్ల నష్టానికి 53 పరుగులు చేసింది. అలెక్స్‌ డేవిస్‌ (0), విల్‌ రోడ్స్‌ (19) ఔట్‌ కాగా.. రాబర్ట్‌ యేట్స్‌ (26), సామ్‌ హెయిన్‌ (6) క్రీజ్‌లో ఉన్నారు. హెల్మ్‌, బాంబర్‌ తలో వికెట్‌ పడగొట్టారు.

అంతకుముందు టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన వార్విక్‌షైర్‌.. బాంబర్‌ (5/20), కెప్టెన్‌ టోబీ జోన్స్‌ (3/27), ర్యాన్‌ హిగ్గిన్స్‌ (2/5) ధాటికి 22.5 ఓవర్లలో 60 పరుగులకే కుప్పకూలింది. 14 పరుగులు చేసిన బర్నార్డ్‌ వార్విక్‌షైర్‌ ఇన్నింగ్స్‌లో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. బర్నార్డ్‌తో పాటు మైఖేల్‌ బుర్గెస్‌ (12), రాబర్ట్‌ యేట్స్‌ (10), డాల్బీ (10) మాత్రమే వార్విక్‌షైర్‌ ఇన్నింగ్స్‌లో రెండంకెల స్కోర్లు చేశారు. 

Videos

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)