Breaking News

షారుఖ్‌ ఖాన్‌‌ ఊచకోత.. మెరుపు ఆర్ధశతకం, బంతితోనూ మ్యాజిక్‌

Published on Mon, 07/03/2023 - 09:42

తమిళనాడు ప్రీమియర్‌ లీగ్‌ 2023లో భాగంగా మధురై పాంథర్స్‌తో  నిన్న (జులై 2) జరిగిన మ్యాచ్‌లో కోవై కింగ్స్‌ సారధి షారుఖ్‌ ఖాన్‌ ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో (53, 2/35) మెరిశాడు. ఫలితంగా అతని జట్టు కోవై కింగ్స్‌ 44 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 

షారుఖ్‌ ఖాన్‌‌ ఊచకోత..
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన కోవై కింగ్స్‌.. సురేశ్‌ కుమార్‌ (29 బంతుల్లో 64; 6 ఫోర్లు, 4 సిక్సర్లు), సచిన్‌ (51 బంతుల్లో 67; 5 ఫోర్లు, 2 సిక్సర్లు), షారుఖ్‌ ఖాన్‌ (23 బంతుల్లో 53; 6 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపు అర్ధశతకాలతో రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 208 పరుగులు చేసింది. ఇన్నింగ్స్‌ ఆరంభంలో సురేశ్‌ కుమార్‌, ఆఖర్లో షారుఖ్‌ ఖన్‌ రెచ్చిపోయి ఆడారు. ముఖ్యంగా షారుఖ్‌ ఖాన్‌ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. 20 బంతుల్లోనే హాఫ్‌ సెంచరీ బాదాడు.

బంతితోనూ మెరిసిన షారుఖ్‌..
తొలుత బ్యాట్‌తో ఇరగదీసిన షారుఖ్‌ ఖాన్‌. ఆతర్వాత బంతితోనూ రాణించాడు. 209 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన మధురై పాంథర్స్‌ను షారుఖ్‌ ఖాన్‌ (2/35).. సిద్దార్థ్‌ (3/32), యుదీశ్వరన్‌ (2/16), సుబ్రమణ్యన్‌ (1/26), గౌతమ్‌ కన్నన్‌ (1/40) సాయంతో దెబ్బకొట్టాడు. ఫలితంగా మధురై పాంథర్స్‌ 18 ఓవర్లలో 164 పరుగులకే కుప్పకూలి, 44 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. పాంథర్స్‌ ఇన్నింగ్స్‌లో సురేశ్‌ లోకేశ్వర్‌ (41) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)