పథకాలు అమలు చేస్తున్న కానీ కాంగ్రెస్‌కి ప్రజల్లో వ్యతిరేకత
Breaking News
T20 WC 2021: ఆస్ట్రేలియతో ఫైనల్.. కాన్వే స్థానంలో ఎవరంటే
Published on Sat, 11/13/2021 - 15:17
Tim Seifert Replace Devon Conway For T20 WC 2021 Final.. టి20 ప్రపంచకప్ 2021లో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ మధ్య ఫైనల్ జరగనున్న సంగతి తెలిసిందే. అయితే ఫైనల్‌కు గాయం కారణంగా స్టార్ బ్యాట్స్‌మన్ డెవన్ కాన్వే దూరమయ్యాడు. అతని స్థానంలో టిమ్ స్టీఫెర్ట్‌ను ఎంపిక చేసినట్లు కివీస్ బోర్డు శనివారం ఒక ప్రకటనలో తెలిపింది. టి20 ప్రపంచకప్ అనంతరం టీమిండియాతో జరగనున్న టి20 సిరీస్‌కు కూడా స్టీఫెర్ట్ అందుబాటులో ఉంటాడని పేర్కొంది. ఇక టిమ్ స్టీఫెర్ట్ న్యూజిలాండ్ తరపున 36 టి20ల్లో 703 పరుగులు చేశాడు.
చదవండి: T20 WC 2021: కోహ్లి.. టాస్ కోసం ఏమైనా టిప్స్ ఇస్తావా: కేన్ విలియమ్సన్
ఇక నవంబర్10న ఇంగ్లండ్‌తో జరిగిన తొలి సెమిఫైనల్లో విజయం సాధించి న్యూజిలాండ్ ఫైనల్‌కు చేరడంలో కాన్వే కీలక పాత్ర పోషించాడు. అయితే తొలి సెమీఫైనల్లో 46 పరుగులు చేసిన కాన్వే.. కీలక సమయంలో లివింగ్‌స్టోన్ బౌలింగ్‌లో స్టంప్ ఔట్‌గా వెనుదిరిగాడు. ఈ క్రమంలో కొంత అసహనానికి గురైన కాన్వే.. చేతితో బ్యాట్‌ను గట్టిగా గుద్దాడు. దీంతో అతడి కుడి చేతి ఎముక విరిగింది. దీంతో విచిత్రరీతిలో కాన్వే టి20 ప్రపంచకప్ నుంచి దూరమవ్వాల్సి వచ్చింది.
చదవండి: Marnus Labuschagne: పక్కకు పోతుందని వదిలేశాడు.. మైండ్‌బ్లాక్; లబుషేన్ అద్భుతం
Tags : 1