Breaking News

టిమ్ డేవిడ్ మెరుపు సెంచ‌రీ.. విండీస్‌ను చిత్తు చేసిన ఆసీస్‌

Published on Sat, 07/26/2025 - 12:37

వెస్టిండీస్ గడ్డపై ఆస్ట్రేలియా జైత్ర యాత్ర కొనసాగుతోంది. శనివారం సెయింట్స్ కిట్స్ వేదికగా విండీస్‌తో జరిగిన మూడో టీ20లో 6 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. తద్వారా 5 టీ20ల సిరీస్‌ను మరో రెండు మ్యాచ్ మిగిలూండగానే 3-0 తేడాతో కంగారులు సొంతం చేసుకున్నారు.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన క‌రేబియ‌న్ జ‌ట్టు 4 వికెట్ల నష్టానికి 214 పరుగుల భారీ స్కోర్ సాధించింది. విండీస్ కెప్టెన్ షాయ్ హోప్‌(102) ఆజేయ శతకంతో కదం తొక్కగా.. బ్రాండెన్ కింగ్‌(62) రాణించాడు. ఆసీస్ బౌల‌ర్ల‌లో మిచెల్ ఓవెన్‌, ఎల్లీస్‌, జంపా త‌లా వికెట్ సాధించారు.

డేవిడ్ విధ్వంస‌క‌ర శ‌త‌కం..
అనంత‌రం 215 ప‌రుగుల భారీ ల‌క్ష్యాన్ని ఆసీస్ కేవ‌లం 4 వికెట్లు మాత్ర‌మే కోల్పోయి 16.1 ఓవ‌ర్ల‌లో చేధించింది. ఈ ల‌క్ష్య చేధ‌న‌లో ఆసీస్ ఆట‌గాడు టిమ్ డేవిడ్ విధ్వంస‌క‌ర సెంచ‌రీతో చెల‌రేగాడు. కేవ‌లం 37 బంతుల్లోనే  6 ఫోర్లు, 11 సిక్సర్ల సాయంతో 102 ప‌రుగులు చేసి ఆజేయ‌గా నిలిచాడు.

ఆస్ట్రేలియా త‌ర‌పున టీ20ల్లో ఫాస్టెస్ట్ సెంచ‌రీ చేసిన ఆట‌గాడిగా డేవిడ్ రికార్డుల‌కెక్కాడు. డేవిడ్‌తో పాటు మిచెల్ ఓవెన్‌(36 నాటౌట్‌), మార్ష్‌(22), మాక్స్‌వెల్‌(20) రాణించారు. విండీస్ బౌల‌ర్ల‌లో షెఫ‌ర్డ్ రెండు వికెట్లు ప‌డ‌గొట్ట‌గా.. హోల్డ‌ర్ ఓ వికెట్ సాధించారు. మ‌రో వికెట్ ర‌నౌట్ రూపంలో ల‌భించింది. ఇరు జ‌ట్ల మ‌ధ్య నాలుగో టీ20 ఇదే వేదిక‌లో జ‌ర‌గ‌నుంది.
చదవండి: ప్లేయర్స్‌ను గంభీర్‌ న‌మ్మ‌డం లేదు.. ఇలా అయితే చాలా క‌ష్టం: మనోజ్‌ తివారీ
 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)