Breaking News

చెలరేగిన హాజిల్‌వుడ్‌, డేవిడ్‌.. సౌతాఫ్రికాపై ఆసీస్‌ ఘన విజయం

Published on Sun, 08/10/2025 - 20:04

స్వ‌దేశంలో సౌతాఫ్రికాతో మూడు టీ20ల సిరీస్‌ను ఆస్ట్రేలియా విజ‌యంతో ఆరంభించింది. ఆదివారం డార్విన్ వేదిక‌గా జ‌రిగిన తొలి టీ20లో సౌతాఫ్రికాను 17 ప‌రుగుల తేడాతో ఆసీస్ ఓడించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో 10 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేయగల్గింది.

ఆసీస్ బ్యాట‌ర్ల‌లో టిమ్ డేవిడ్ విధ్వంసం సృష్టించాడు. తన సహచర ఆటగాళ్లు విఫలమైనప్పటికి డేవిడ్ మాత్రం ప్రత్యర్ధి బౌలర్లపై విరుచుపడ్డాడు. 52 బంతులు ఎదుర్కొన్న డేవిడ్‌.. 8 సిక్స్‌లు, 4 ఫోర్లతో 83 పరుగులు చేశాడు. అతడితో పాటు కామెరూన్ గ్రీన్(35) రాణించాడు. దక్షిణాఫ్రికా బౌలర్లలో క్వేనా మఫాకా నాలుగు వికెట్లు పడగొట్టగా.. రబాడ రెండు, ఎంగిడీ, లిండే, ముత్తుసామి చెరో వికెట్ సాధించారు.

రికెల్టన్ విరోచిత పోరాటం..
అనంతరం 179 పరుగుల లక్ష్య చేధనలో సౌతాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 161 పరుగులు మాత్రమే చేయగల్గింది. సఫారీ బ్యాటర్లలో ర్యాన్ రికెల్టన్‌(55 బంతుల్లో 7 ఫోర్లు, ఒక సిక్స్‌తో 71) ఆఖరి వరకు పోరాడాడు. అతడితో పాటు స్టబ్స్‌(37) పర్వాలేదన్పించాడు.

మిగితా బ్యాటర్లు విఫలం కావడంతో ప్రోటీస్ ఓటమి చవిచూడాల్సి వచ్చింది. ఆస్ట్రేలియా బౌలర్లలో బెన్ ద్వార్షుయిస్, జోష్ హాజిల్ వుడ్ చెరో మూడు వికెట్లతో సత్తాచాటగా.. జంపా రెండు, మాక్స్‌వెల్ తలా వికెట్ సాధించారు. ఇక ఇరు జట్ల మధ్య రెండో టీ20 ఆగస్టు 12న డార్విన్ వేదికగా జరగనుంది.
చదవండి: రాజస్తాన్ రాయల్స్‌తో నా జర్నీ ఒక అద్భుతం.. వారికి థ్యాంక్స్‌: శాంసన్‌

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)