Breaking News

టిమ్‌ డేవిడ్‌ విలయతాండవం

Published on Mon, 12/01/2025 - 07:12

అబుదాబీ టీ10 లీగ్‌ (Abu Dhabi T10 League) 2025 ఎడిషన్‌లో యూఏఈ బుల్స్‌ (UAE Bulls) విజేతగా ఆవిర్భవించింది. నిన్న (నవంబర్‌ 30) జరిగిన ఫైనల్లో ఆస్పిన్‌ స్టాల్లియన్స్‌పై 80 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన యూఏఈ బుల్స్‌ నిర్ణీత 10 ఓవర్లలో వికెట్‌ నష్టానికి 150 పరుగుల ఊహకందని స్కోర్‌ చేసింది.

బుల్స్‌కు ఆడుతున్న ఆస్ట్రేలియా విధ్వంసకర వీరుడు టిమ్‌ డేవిడ్‌ (Tim David) కేవలం 30 బంతుల్లో 12 సిక్సర్లు, 3 బౌండరీల సాయంతో అజేయమైన 98 పరుగులు చేసి విశ్వరూపం ప్రదర్శించాడు. 

మిగతా ఆటగాళ్లలో రోవ్‌మన్‌ పావెల్‌ 20 బంతుల్లో 24 (నాటౌట్‌), ఫిల్‌ సాల్ట్‌ 8 బంతుల్లో 18 పరుగులు చేశారు. జేమ్స్‌ విన్స్‌ డకౌటయ్యాడు.

అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన స్టాల్లియన్స్‌ ఏ దశలోనూ గెలుపు దిశగా సాగలేదు. ఓపెనర్ కమ్‌ కెప్టెన్‌ రహ్మానుల్లా గుర్బాజ్‌ (15 బంతుల్లో 18) సహా అంతా నిదానంగా ఆడారు. 

ఆండీ ఫ్లెచర్‌ 2 (రిటైర్డ్‌ హర్ట్‌), షెర్ఫాన్‌ రూథర్‌ఫోర్డ్‌ డకౌట్‌, డు ప్లూయ్‌ 16, కట్టింగ్‌ 11, కరీమ్‌ జనత్‌ 15, సామ్‌ బిల్లింగ్స్‌ 3 పరుగులు మాత్రమే చేశారు. సిక్సర్ల సునామీ సృష్టించి యూఏఈని ఒంటిచేత్తో గెలిపించిన టిమ్‌ డేవిడ్‌కు ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు లభించింది. 9 సీజన్ల లీగ్‌ చరిత్రలో యూఏఈ బుల్స్‌కు ఇదే మొదటి టైటిల్‌. 

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

కార్తి 'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్..(ఫొటోలు)

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు