రీఎంట్రీలో అదరగొట్టిన తిలక్‌ వర్మ

Published on Mon, 02/02/2026 - 18:44

టీమిండియా స్టార్ బ్యాటర్ తిలక్ వర్మ తన రీఎంట్రీలో సత్తాచాటాడు. టీ20 ప్రపంచకప్‌-2026 ఆరంభానికి ముందు నవీ ముంబై వేదికగా అమెరికాతో జరుగుతున్న వార్మప్ మ్యాచ్‌లో తిలక్ అదరగొట్టాడు. ఈ మ్యాచ్‌లో ఇండియా-ఎకు ప్రాతినిథ్యం వహిస్తున్న తిలక్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు.

ఫస్ట్ డౌన్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన తిలక్‌.. కేవలం 24 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 38 పరుగులు చేశాడు. తొలుత  8 బంతుల్లో 10 పరుగులు మాత్రమే చేసి కాస్త ఆచితూచి ఆడిన తిలక్‌.. హర్మీత్ సింగ్ బౌలింగ్‌లో వరుసగా ఫోర్, సిక్స్ బాది ఒక్కసారిగా జోరు పెంచాడు. వికెట్ కీపర్ నారాయణ్ జగదీశన్‌తో కలిసి తిలక్  స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. 

అయితే మంచి టచ్‌లో కన్పించిన తిలక్‌, అమెరికా పేసర్ శుభమ్ రంజన్ బౌలింగ్‌లో వికెట్ కీప‌ర్‌కు క్యాచ్ ఇచ్చి ఔట‌య్యాడు. ఈ మ్యాచ్ త‌ర్వాత తిల‌క్ మంగ‌ళ‌వారం(ఫిబ్ర‌వ‌రి 3)న జ‌ట్టుతో క‌లవ‌నున్నాడు. తిల‌క్ దాదాపు నెల రోజుల నుంచి పోటీ క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు. అయిన‌ప్ప‌టికి గాయం నుంచి కోలుకుని తిరిగొచ్చిన తొలి మ్యాచ్‌లోనే ఈ త‌ర‌హా ప్ర‌ద‌ర్శ‌న చేయ‌డం గ‌మ‌నార్హం.

భారత్‌ భారీ స్కోర్‌
కాగా జగదీశన్‌ నారయణ్‌ విధ్వంసకర సెంచరీతో చెలరేగాడు. కేవలం 55 బంతుల్లో 11 ఫోర్లు, 4 సిక్స్‌లతో 104 పరుగులు చేశాడు. అతడితో పాటు కెప్టెన్‌ ఆయూష్‌ బదోని(60) అజేయ హాఫ్‌ సెంచరీతో మెరిశాడు. ఫలితంగా తొలుత బ్యాటింగ్‌ చేసిన ఇండియా-ఎ జట్టు మూడు వికెట్ల నష్టానికి 238 పరుగుల భారీ స్కోర్‌ సాధించింది. అమెరికా బౌలర్లలో అలీ ఖాన్‌, శుభమ్‌, జస్‌దీప్‌ సింగ్‌ తలా వికెట్‌ పడగొట్టారు.

Videos

ఫ్లెక్సీని చూసి తన తల్లి అనుకొని.. పాల కోసం ఆకలితో లేగదూడ తంటాలు

నువ్వు జోక్యం చేసుకుంటే.. నీ హోంమినిస్టర్ పోస్ట్ ఊడిపోతుంది..!

సాక్షి టీవీ సోషల్ మీడియా అకౌంట్లను బ్లాక్ చేయించిన కూటమి సర్కార్

దగ్గుపాటి ప్రసాద్ కు గంగారాం షాక్!

బస్సును ముద్దాడిండు డ్రైవరన్న

ప్రియుడితో కలిసి భర్తను చంపేందుకు భార్య కుట్ర

అవి వాళ్ళు రాస్తే వచ్చే మార్కులు కాదు.. SGT ప్రభాకర్ కు ఉద్యోగం ఎలా ఇచ్చారంటే

ఇంకెన్నాళ్లు నీ కొడుకును కాపాడుకుంటావ్.. వైఎస్ జగన్ సెన్సేషనల్ కామెంట్స్

ఒక రోజుకు 80 లక్షలు... ఎవడబ్బ సొమ్మని ఖర్చు పెడుతున్నారు..!

చైనా వేదికపై ఫేక్ మేయర్ ప్రచారం?

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)