Breaking News

చరిత్ర సృష్టించిన తిలక్‌ వర్మ.. రెండో భారత ఆటగాడిగా! పంత్‌ రికార్డు బద్దలు

Published on Mon, 08/07/2023 - 07:26

టీమిండియా యువ ఆటగాడు తిలక్‌ వర్మ తన అద్భుతమైన ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. ఈ క్రమంలో అంతర్జాతీయ క్రికెట్‌లో తొలి హాఫ్‌ సెంచరీ సాధించాడు. వెస్టిండీస్‌తో జరిగిన తొలి టీ20లో దుమ్ము రేపిన తిలక్‌.. గయనా వేదికగా జరిగిన రెండో టీ20లో కూడా అదే తరహా ప్రదర్శన చేశాడు. ఈ మ్యాచ్‌లో 41 బంతులు ఎదుర్కొన్న తిలక్‌ వర్మ 5 ఫోర్లు, 1 సిక్స్‌ సాయంతో 51 పరుగులు చేశాడు

ఇక హాఫ్‌ సెంచరీతో అదరగొట్టిన తిలక్‌ వర్మ ఓ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. అంతర్జాతీయ టీ20ల్లో అతి తక్కువ వయస్సులో హాఫ్‌ సెంచరీ రెండో భారత ఆటగాడిగా తిలక్‌ వర్మ రికార్డులకెక్కాడు. వర్మ ఈ ఘనతను కేవలం 20 ఏళ్ల 271 రోజుల వయస్సులో అందుకున్నాడు. ఈ క్రమంలో టీమిండియా వికెట్‌ కీపర్‌ రిషబ్‌ పంత్‌ను తిలక్‌ అధిగమించాడు. పంత్‌ 21 ఏళ్ల 38 రోజుల వయస్సులో ఈ రికార్డును సాధించాడు. ఇక ఓవరాల్‌గా ఈ అరుదైన ఫీట్‌ సాధించిన జాబితాలో టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ తొలి స్ధానంలో ఉన్నాడు. రోహిత్‌ ఈ అరుదైన ఘనతను 20 ఏళ్ల 143 రోజుల వయస్సులో నమోదు చేశాడు. 

ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. ఐదు మ్యాచ్‌ల టీ20ల సిరీస్‌లో టీమిండియా వరుసగా రెండో ఓటమి చవి చూసింది. గయనా వేదికగా విండీస్‌తో జరిగిన రెండో టీ20లో 2 వికెట్ల తేడాతో భారత్‌ ఓటమి పాలైంది. టాస్‌ గెలిచిన భారత్‌ ముందుగా 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది. భారత బ్యాటర్లలో తిలక్‌ వర్మ(51) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. విండీస్‌ బౌలర్లలో  అకిల్‌ హోసీన్, అల్జారి జోసెఫ్, షెఫర్డ్‌ తలా 2 వికెట్లు పడగొట్టారు.

అనంతరం లక్ష్యఛేదనకు దిగిన వెస్టిండీస్‌ 18.5 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 155 పరుగులు చేసి గెలిచింది. విండీస్‌ బ్యాటర్లలో ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ నికోలస్‌ పూరన్‌ (40 బంతుల్లో 67; 6 ఫోర్లు, 4 సిక్సర్లు) అద్భుతమైన ఇన్నింగ్స్‌ ఆడాడు. భారత బౌలర్లలో కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యా మూడు వికెట్లు, చహల్‌ రెండు వికెట్లు పడగొట్టినప్పటికి జట్టును మాత్రం గెలిపించలేకపోయారు.
చదవండిగ్రీన్‌ సిగ్నల్‌.. ప్రపంచకప్‌ కోసం భారత్‌కు పాక్‌ 

Videos

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)