Breaking News

ముగ్గురు పాక్‌ హాకీ ప్లేయర్లపై జీవితకాల నిషేధం

Published on Fri, 08/30/2024 - 10:34

లాహోర్‌: ముగ్గురు పాకిస్తాన్‌ హాకీ ఆటగాళ్లు సహా ఒక ఫిజియోథెరపిస్ట్‌పై ఆ దేశ హాకీ సమాఖ్య (పీహెచ్‌ఎఫ్‌) జీవితకాల నిషేధం విధించింది. ఈ నలుగురు ఒక యూరోపియన్‌ దేశంలో రాజకీయ పీడిత శరణార్థిగా ఆశ్రయం కోరారు. దీంతో ఆగ్రహించిన పీహెచ్‌ఎఫ్‌ ఆ నలుగురుపై కఠిన నిర్ణయం తీసుకుంది. ప్లేయర్లు ముర్తజా యాకుబ్, ఎతేషామ్‌ అస్లామ్, అబ్దుర్‌ రహ్మాన్, ఫిజియో వకాస్‌ గత నెల నెదర్లాండ్స్, పొలాండ్‌లలో జరిగిన నేషన్స్‌ కప్‌ ఆడేందుకు జట్టుతో పాటు వెళ్లారు.

తిరిగొచ్చాక ఆసియా చాంపియన్స్‌ ట్రోఫీ కోసం శిక్షణ శిబిరాన్ని ఏర్పాటు చేస్తే ఆ నలుగురు వ్యక్తిగత కారణాలతో గైర్హాజరు అయ్యారు. అనంతరం వారంతా నేషన్స్‌ కప్‌ ఆడేందుకు వెళ్లొచ్చిన షెన్‌జెన్‌ వీసా (ఐరోపాయేతర పౌరులకు 90 లేదా 180 రోజుల వ్యవధి కోసం మంజూరు చేసే తాత్కాలిక వీసా)తో మళ్లీ నెదర్లాండ్స్‌కు వెళ్లి అక్కడ ఆశ్రయం పొందారు. ఇది తమ దేశానికి తలవంపు మాత్రమే కాదు... భవిష్యత్తులో యూరోపియన్‌ దేశాలకు వీసాలు దరఖాస్తు చేసే వారందరికీ ఇది పెద్ద సమస్యగా పరిణమిస్తుంది. ఆయా దేశాల్లో జరిగే ఈవెంట్ల కోసం ఇకపై తమ దరఖాస్తులు ఆమోదం పొందడం క్లిష్టతరమవుతుందని పీహెచ్‌ఎఫ్‌ కార్యదర్శి రాణా ముజాహిద్‌ వాపోయారు.

#

Tags : 1

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)