Breaking News

విరాట్ కోహ్లి ఒక లెజెండ్‌.. బాబ‌ర్‌తో పోలికేంటి: పాక్‌ మాజీ క్రికెటర్‌

Published on Tue, 07/02/2024 - 16:51

అంతర్జాతీయ టీ20ల్లో టీమిండియా స్టార్ బ్యాటర్‌, విరాట్ కోహ్లి ప్రయాణం ముగిసిన సంగతి తెలిసిందే. టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్-2024 ఫైన‌ల్లో ద‌క్షిణాఫ్రికాపై విజ‌యం అనంత‌రం పొట్టి క్రికెట్‌కు కోహ్లి విడ్కోలు ప‌లికాడు. ఈ మెగా టోర్నీ మొత్తం పేలవ ఫామ్ క‌న‌బ‌రిచి విమ‌ర్శ‌లు ఎదుర్కొన్న కింగ్ కోహ్లి.. కీల‌కమైన ఫైన‌ల్లో మాత్రం స‌త్తాచాటాడు. 

టాపార్డ‌ర్ విఫ‌ల‌మైన చోట కోహ్లి అద్బుత‌మైన ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రిచాడు. ఫైన‌ల్ మ్యాచ్‌లో 76 ప‌రుగులు చేసిన విరాట్ కోహ్లి.. ద‌క్షిణాఫ్రికాకు ముందు మెరుగైన స్కోర్ ఉంచ‌డంలో కీల‌క పాత్ర పోషించాడు. ఆ త‌ర్వాత బౌలర్లు సంచ‌ల‌న ప్ర‌ద‌ర్శ‌న చేయ‌డంతో భార‌త్ రెండోసారి టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్ ఛాంపియ‌న్స్‌గా అవ‌త‌రించింది. 

ఇక ఫైన‌ల్ మ్యాచ్‌లో త‌న ప్ర‌ద‌ర్శ‌నగాను కింగ్ కోహ్లికి ప్లేయ‌ర్ ఆఫ్‌ది మ్యాచ్ అవార్డు ద‌క్కింది. ఈ నేప‌థ్యంలో విరాట్ కోహ్లిపై పాకిస్తాన్ మాజీ క్రికెట‌ర్ అహ్మద్ షెహజాద్ ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించాడు. ప్ర‌స్తుత త‌రంలో కోహ్లికి మించిన క్రికెటర్‌ మరొకడు లేడని షెహజాద్ అభిప్రాయపడ్డాడు.

"విరాట్‌ కోహ్లి ఒక లెజెండ్‌. మా తరంలో అతడిని మించిన క్రికెటర్‌ మరొకడు లేడు. విరాట్‌ తన టీ20 కెరీర్‌ను ఘనంగా ముగించాడు. తన కెరీరంతటా కోహ్లి అద్బుతంగా ఆడాడు. ఆఖరికి చివరి మ్యాచ్‌లో కూడా కోహ్లి అదరగొట్టాడు. 

అది విరాట్‌ కోహ్లి బ్రాండ్‌. ఫైనల్లో తన సహచర ఆటగాళ్లు పెవిలియన్‌కు క్యూ కడితే.. విరాట్‌ మాత్రం బౌండరీల వర్షం కురిపించాడు. అందుకే విరాట్‌ను మించిన వాడు లేడని నేను పదేపదే చెబుతున్నాను. 

విరాట్‌ను గతంలో చాలా మంది బాబర్‌ ఆజంతో పోల్చారు. కానీ అది సరికాదు. విరాట్‌కు ఎవరూ సాటిరారు. కోహ్లి ఐసీసీ టోర్నమెంట్లలో అద్భుతమైన స్ట్రైక్ రేట్ , యావరేజ్ కలిగి ఉన్నాడు. వరల్డ్‌ క్రికెట్‌లో ఒకే ఒక్క విరాట్‌ కోహ్లి ఉంటాడని" ఓ స్పోర్ట్స్‌ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో షెహజాద్ పేర్కొన్నాడు.
 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)