Breaking News

నల్గొండను చిత్తు చేసిన రంగారెడ్డి

Published on Mon, 06/22/2026 - 14:20

తెలంగాణ టీ20 లీగ్‌-2026లో రెండో మ్యాచ్‌ నిర్వహణకు రంగం సిద్ధమైంది. లీగ్‌ ఆరంభ మ్యాచ్‌లో ఖమ్మం ఏసెస్‌.. పాలమూరు స్ట్రైకర్స్‌పై గెలుపొందగా.. తాజాగా సోమవారం నాటి మధ్యాహ్నం మ్యాచ్‌లో రంగారెడ్డి రైజర్స్‌- నల్గొండ నైట్స్‌ అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమయ్యాయి.

ఉప్పల్‌లోని రాజీవ్‌ గాంధీ స్టేడియం వేదికగా టాస్‌ గెలిచిన రంగారెడ్డి తొలుత ఫీల్డింగ్‌ ఎంచుకుంది. ఫలితంగా నల్గొండ ముందుగా బ్యాటింగ్‌కు దిగింది. 

నల్గొండ స్కోరెంతంటే?
నల్గొండ ఓపెనర్లు గౌరవ్‌ రెడ్డి (0), ప్రణవ్‌ సూర్యదేవర (7) విఫలం కాగా.. వన్‌డౌన్‌ బ్యాటర్‌ నితీశ్‌ రెడ్డి 20 పరుగులు చేయగా.. కెప్టెన్‌ రాహుల్‌ బుద్ధి వేగంగా (19 బంతుల్లో 30) ఆడాడు. వరుణ్‌ గౌడ్‌ (26) రాణించగా.. అర్ఫాజ్‌ (7), అనికేత్‌ రెడ్డి (0) ఫెయిలయ్యారు. 

ఇలాంటి దశలో దివేశ్‌ సింగ్‌ 27 బంతుల్లో 48 పరుగులు చేయగా.. హర్షవర్ధన్‌ సింగ్‌ 20 బంతుల్లో ఐదు ఫోర్లు, ఒక సిక్స్‌ బాది 40 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి నల్గొండ 189 పరుగులు చేయగలిగింది. 

రంగారెడ్డి బౌలర్లలో పున్నయ్య మూడు, కరియప్ప, నితిన్‌ సాయి యాదవ్‌ చెరో రెండు, కెప్టెన్‌ తనయ్‌ త్యాగరాజన్‌ ఒక వికెట్‌ దక్కించుకున్నారు. 

రంగారెడ్డి ఘన విజయం
నల్గొండ విధించిన 190 పరుగుల లక్ష్యాన్ని రంగారెడ్డి 16.3 ఓవర్లలో ఐదు వికెట్లు నష్టపోయి ఛేదించింది. ఆదిత్య జువ్వాజి 41 పరుగులు చేయగా.. తనయ్‌ త్యాగరాజన్‌ కెప్టెన్‌ ఇన్నింగ్స్‌ ఆడాడు. 30 బంతుల్లో ఏడు ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 71 పరుగులతో అజేయంగా నిలిచాడు. అతడితో పాటు నితిన్‌ సాయి యాదవ్‌ (9 బంతుల్లో 26 నాటౌట్‌) మెరుపులు మెరిపించాడు. 

తుదిజట్లు
రంగారెడ్డి రైజర్స్‌
తనయ్‌ త్యాగరాజన్‌ (కెప్టెన్‌), ఆరోన్‌ జార్జ్‌ వర్గిస్‌, అవినాశ్‌ రావు (వికెట్‌ కీపర్‌), అలంకృత్‌ రాపోల్‌, జ్ఞాన ప్రకాశ్‌ రెడ్డి, ఆదిత్య జవ్వాజి, నితిన్‌ సాయి యాదవ్‌, నానావత్‌ రాకేశ్‌, అరుణ్‌ కుమార్‌, భువనగిరి పున్నయ్య, ఆర్యన్‌ కరియప్ప

నల్గొండ నైట్స్‌
రాహుల్‌ బుద్ధి (కెప్టెన్‌), ప్రణవ్‌ సూర్యదేవర, అనికేత్‌ రెడ్డి, గౌరవ్‌ రెడ్డి, పి. నితీశ్‌ రెడ్డి, వరుణ్‌ గౌడ్‌, ఎండీ అర్ఫాజ్‌ అహ్మద్‌, టి. హర్షవర్దన్‌ సింగ్‌ (వికెట్‌ కీపర్‌), దివేశ్‌ సింగ్‌, చిన్నట్ల ర‍క్షణ్‌ రెడ్డి, నిశాంత్‌ సరాను.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)