Breaking News

ఖమ్మంపై గెలుపు.. హైదరాబాద్‌దే టైటిల్‌

Published on Sun, 07/12/2026 - 19:08

టీజీ20 లీగ్‌ విజేతగా హైదరాబాద్‌
టీజీ20 లీగ్‌ ఆరంభ ఎడిషన్‌ (2026) విజేతగా హైదరాబాద్‌ ఈ ఛాంపియన్స్‌ జట్టు అవతరించింది. ఇవాళ (జులై 12) జరిగిన ఫైనల్లో ఆ జట్టు అన్విత ఖమ్మం ఏసెస్‌పై 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి తొలుత బౌలింగ్‌ చేసిన హైదరాబాద్‌ ఖమ్మంను 157 పరుగులకే (8 వికెట్ల నష్టానికి) పరిమితం చేసింది. అనంతరం లక్ష్యాన్ని 17.4 ఓవర్లలో 4 వికెట్లు మాత్రమే కోల్పోయి సునాయాసంగా ఛేదించింది. 

రెండో వికెట్‌ కోల్పోయిన హైదరాబాద్‌
7.4వ ఓవర్‌- 69 పరుగుల వద్ద హైదరాబాద్‌ రెండో వికెట్‌ కోల్పోయింది. విద్యానంద్‌ రెడ్డి బౌలింగ్‌లో అశ్విన్‌ (36) ఔటయ్యాడు.

ధాటిగా ఆడుతున్న అభిరథ్‌
158 పరుగుల లక్ష్య ఛేదనలో హైదరాబాద్‌ జట్టు రెండో ఓవర్‌లోనే వికాస్‌ (4) వికెట్‌ కోల్పోయినప్పటికీ.. ధాటిగా ఆడుతుంది. మరో ఓపెనర్‌ అభిరథ్‌ రెడ్డి (23) బ్యాట్‌ ఝులిపిస్తున్నాడు. అతడికి అశ్విన్‌ (16) కూడా సహకరిస్తున్నాడు. 5 ఓవర్ల తర్వాత హైదారాబద్‌ స్కోర్‌ 44-1గా ఉంది. 

హైదరాబాద్‌ ముందు నామమాత్రపు టార్గెట్‌
టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన ఖమ్మం హైదరాబాద్‌ ముందు 158 పరుగుల నామమాత్రపు టార్గెట్‌ ఉంచింది. ఖమ్మం తరఫున మికెల్‌ జైస్వాల్‌ (65) మెరుపు అర్ద సెంచరీతో సత్తా చాటగా.. ఆఖర్లో విద్యానంద రెడ్డి (20 నాటౌట్‌) బ్యాట్‌ ఝులిపించాడు. స్టార్‌ బ్యాటర్‌ మిలింద్‌ డకౌట్‌ కాగా.. హిమతేజ (31) ఓ మోస్తరు స్కోర్‌ చేశాడు. హైదరాబాద్‌ బౌలర్లలో యశ్‌వీర్‌ గౌడ్‌ 3 వికెట్లతో సత్తా చాటగా.. మెహతా, దేవ్‌గౌడ్‌ తలో 2, రాధోడ్‌ ఓ వికెట్‌ పడగొట్టారు. 

16 ఓవర్ల తర్వాత ఖమ్మం స్కోర్‌ 122-5
జైస్వాల్‌ (60), మల్లు (2) బ్యాటింగ్‌

ఆటకు అంతరాయం
స్టేడియంలో ఓ ఫ్లడ్‌లైట్‌ సమస్య తలెత్తడంతో ఆటకు అంతరాయం ఏర్పడింది.

నిలకడగా ఆడుతున్న హిమతేజ, జైస్వాల్‌
11 ఓవర్ల తర్వాత ఖమ్మం స్కోర్‌ 76-3గా ఉంది. హిమతేజ (32), జైస్వాల్‌ (18) నిలకడగా ఆడుతున్నారు. 

26 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన ఖమ్మం
ఖమ్మం జట్టు 26 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. మెహతా బౌలింగ్‌లో 3 బంతుల వ్యవధిలో ఖమ్మం జట్టు రెండు వికెట్లు కోల్పోయింది. పి రెడ్డి (15), కృష్ణా రెడ్డి (4) ఔట్‌ కాగా.. హిమతేజ (2), జైస్వాల్‌ (0) క్రీజ​్‌లో ఉన్నారు. 5.3 ఓవర్ల తర్వాత ఖమ్మం స్కోర్‌ 27-3గా ఉంది. 

తొలి వికెట్‌ కోల్పోయిన ఖమ్మం
1.4వ ఓవర్‌- రెండో ఓవర్‌లోనే ఖమ్మం జట్టుకు ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు ఓపెనర్‌ పి రాజ్‌ (3) దేవ్‌ గౌడ్‌ బౌలింగ్‌లో క్యాచ్‌ అండ్‌ బౌల్డ్‌ అయ్యాడు. 3.1 ఓవర్ల తర్వాత ఆ జట్టు స్కోర్‌ 19-1గా ఉంది. పి రెడ్డి (12), జి కృష్ణా రెడ్డి (2) క్రీజ్‌లో ఉన్నారు. 

టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న హైదరాబాద్‌
టీజీ20 లీగ్‌-2026 ఫైనల్లో అన్విత ఖమ్మం ఏసెస్‌-హైదరాబాద్‌ ఈ ఛాంపియన్స్‌ జట్లు తలపడుతున్నాయి. హైదారాబాద్‌లోని ఉప్పల్‌ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో హైదరాబాద్‌ జట్టు టాస్‌ గెలిచి తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. 

తుది జట్లు..
హైదరాబాద్‌: అభిరథ్‌ రెడ్డి (కెప్టెన్‌), సాయి వికాస్‌ రెడ్డి, వైష్ణవ్‌ రెడ్డి, యశ్వీర్‌ గౌడ్‌, గుడుగు గణేశ్‌, ప్రణవ్‌ వర్మ, అజయ్‌ దేవ్‌గౌడ్‌, అరవింద్‌, షణ్ముఖ్‌ అశ్విన్‌, అఖిల్‌ రాథోడ్‌, దేవ్‌ మెహతా

ఖమ్మం: మిలింద్‌ (కెప్టెన్‌), సహేంద్ర మల్లు, హర్షిత్‌, వేద్‌ రెడ్డి, షేక్‌ అజహర్‌, విద్యానంద రెడ్డి, జీఎస్‌కే రెడ్డి, హిమతేజ, పరాస్‌ రాజ్‌, ప్రతీక్‌ రెడ్డి, మికిల్‌ జైస్వాల్‌

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)