Breaking News

సత్యసాయి నాకు ఫోన్‌ చేశారు.. ఆయన ఆశీర్వాదం వల్లే ట్రోఫీ: సచిన్‌

Published on Wed, 11/19/2025 - 17:15

భారత క్రికెట్‌ దిగ్గజం, శతక శతకాల ధీరుడు సచిన్‌ టెండుల్కర్‌ (Sachin Tendulkar) జీవితంలో 2011 మర్చిపోలేని సంవత్సరం. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఆ ఏడాదే ‘మాస్టర్‌ బ్లాస్టర్‌’ తొలిసారి ప్రపంచకప్‌ను ముద్దాడాడు. సొంతగడ్డపై.. సొంత మైదానం వాంఖడేలో భారత్‌ టైటిల్‌ గెలవడంతో సంతోషంతో ఉప్పొంగిపోయాడు. సహచరులంతా తనను భుజాలపై ఊరేగిస్తుంటే చెమ్మగిల్లిన కళ్లతోనే అభిమానులకు ధన్యవాదాలు చెప్పాడు.

నాటి అందమైన జ్ఞాపకాలను సచిన్‌ టెండుల్కర్‌ తాజాగా గుర్తు చేసుకున్నాడు. సత్యసాయి బాబా శత జయంతి వేడుకల (Sathya Sai Baba Birth Centenary Celebrations) కోసం ఆంధ్రప్రదేశ్‌లోని పుట్టపర్తికి వచ్చిన సచిన్‌.. 2011 వరల్డ్‌కప్‌ సమయంలో ఒత్తిడిని జయించేందుకు వీలుగా బాబా తనలో స్ఫూర్తి నింపిన తీరు వివరించాడు.

చివరి వరల్డ్‌కప్‌ అని తెలుసు
‘‘అప్పటికే నేను చాలా వరకు ప్రపంచకప్‌ టోర్నమెంట్లలో పాల్గొన్నాను. 2011 నాటి టోర్నీ నా కెరీర్‌లో చివరి వరల్డ్‌కప్‌ అని తెలుసు. అప్పుడు నేను జట్టుతో కలిసి బెంగళూరు శిబిరంలో ఉ‍న్నాను.

బాబా స్వయంగా నాకు ఫోన్‌ చేశారు
ఆ సమయంలో నాకో ఫోన్‌ కాల్‌ వచ్చింది. బాబా స్వయంగా నాకు ఫోన్‌ చేశారు. నాకొక పుస్తకం పంపించానని చెప్పారు. అప్పుడు నా ముఖంపై చిరునవ్వు విరిసింది. ఆ ప్రపంచకప్‌ నా జీవితంలో అత్యంత ముఖ్యమైనదని తెలుసు. జట్టుకు కూడా ఎంతో ప్రతిష్టాత్మకమైనది.

బాబా మాటలు, ఆయన పంపిన పుస్తకం నాలో ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేశాయి. అంతర్గత శక్తి పుంజుకుంది. ఆ తర్వాత ఆ పుస్తకం నా జీవితంలో భాగమైపోయింది’’ అని సచిన్‌ టెండుల్కర్‌ సత్యసాయి బాబా పట్ల ప్రేమాభిమానాలను చాటుకున్నాడు.

అదే విధంగా.. ‘‘2011లో ఏం జరిగిందో అందరూ చూశారు. ముంబైలో శ్రీలంకను ఓడించి టీమిండియా ట్రోఫీని ముద్దాడింది. జాతి మొత్తం ఈ విజయాన్ని సెలబ్రేట్‌ చేసుకుంది. నా క్రికెట్‌ జీవితంలో అదొక గోల్డెన్‌ మూమెంట్‌.

బాబా ఆశీర్వాదం వల్లే 
అంతకుముందు నా జీవితంలో మునుపెన్నడూ లేని అనుభూతిని అప్పుడే పొందాను. నా శ్రేయోభిలాషులు, గురువులు... వీరందరితో పాటు బాబా ఆశీర్వాదం వల్లే ఇదంతా సాధ్యమైంది’’ అని సచిన్‌ టెండుల్కర్‌ సత్యసాయి బాబా పట్ల భక్తిని చాటుకున్నాడు. ఎదుటివారిని జడ్జ్‌ చేయకూడదని.. వారిని అర్థం చేసుకోవాలని సత్యసాయి బాబా చెప్పేవారని సచిన్‌ ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నాడు.

కాగా పుట్టపర్తిలో జరుగుతున్న సత్యసాయి బాబా శత జయంతి వేడుకల్లో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ఆంధ్రప్రదేశ్‌కు విచ్చేశారు. ఇక సచిన్‌ టెండుల్కర్‌తో పాటు సినీ నటి ఐశ్వర్యా రాయ్‌ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. 

ఇదిలా ఉంటే.. ధోని కెప్టెన్సీలోని భారత జట్టు 2011 వన్డే వరల్డ్‌కప్‌ ఫైనల్లో శ్రీలంకను ఓడించి జగజ్జేతగా అవతరించిన విషయం తెలిసిందే. ఫలితంగా సచిన్‌ ఖాతాలో ఒక్క ప్రపంచకప్‌ టైటిల్‌ కూడా లేదనే లోటు ఆ ఏడాది తీరిపోయింది.

చదవండి: శుబ్‌మన్‌ గిల్‌ వెళ్తాడు.. కానీ: బీసీసీఐ

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌