Breaking News

చరిత్ర సృష్టించిన బావుమా.. 148 ఏళ్ల టెస్ట్ క్రికెట్ హిస్టరీలోనే

Published on Sun, 06/15/2025 - 13:55

టెంబా బావుమా.. ప్ర‌స్తుతం ఈ పేరు వ‌ర‌ల్డ్ క్రికెట్‌లో మారుమ్రోగిపోతుంది. షాన్ పొలాక్, మార్క్ బౌచ‌ర్‌, గ్రేమ్ స్మిత్‌, హ‌షీమ్ అమ్లా, జాక్వస్ కల్లిస్ వంటి దిగ్గ‌జ కెప్టెన్‌లకు సాధ్యం కానిది.. 35 ఏళ్ల బావుమా సాధించాడు. గ‌త 27 ఏళ్ల అంద‌ని ద్రాక్ష‌గా ఊరిస్తున్న ఐసీసీ ట్రోఫీని బావుమా త‌న దేశానికి తీసుకొచ్చాడు.

లార్డ్స్ వేదిక‌గా జ‌రిగిన వ‌ర‌ల్డ్ టెస్టు ఛాంపియ‌న్‌షిప్ ఫైన‌ల్లో ఆసీస్‌ను బావుమా సార‌థ్యంలోని ప్రోటీస్ 5 వికెట్ల తేడాతో ఓడించింది. దీంతో స‌ఫారీలు రెండో ఐసీసీ టైటిల్‌ను త‌మ ఖాతాలో వేసుకున్నారు. ఈ మ్యాచ్‌లో బావుమా కెప్టెన్‌గా, ఆట‌గాడిగా ఆసాధ‌ర‌ణ ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రిచాడు.

తొలి ఇన్నింగ్స్‌లో 36 ప‌రుగుల‌తో కీల‌క నాక్ ఆడిన టెంబా.. రెండో ఇన్నింగ్స్‌లో విరోచిత పోరాటం చేశాడు. ఓ వైపు తొడ కండ‌రాల గాయంతో బాధ‌ప‌డుతూనే.. జ‌ట్టును ముందుండి న‌డిపించాడు. 134 బంతుల్లో 66 ప‌రుగులు చేసి జ‌ట్టు విజ‌యంలో త‌న వంతు పాత్ర పోషించాడు.

చ‌రిత్ర సృష్టించిన బావుమా..
తన కెప్టెన్సీతో సౌతాఫ్రికా సుదీర్ఘ నిరీక్షణకు తెరదించిన బావుమా.. ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. 148 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో కెప్టెన్‌గా తొలి 10 మ్యాచ్‌లలో ఓటమి లేకుండా తొమ్మిది విజయాలు సాధించిన ఏకైక ప్లేయ‌ర్‌గా బావుమా నిలిచాడు.

బావుమా ఇప్ప‌టివ‌ర‌కు ప‌ది మ్యాచ్‌ల‌లో ప్రోటీస్ కెప్టెన్‌గా వ్య‌వ‌హ‌రించాడు. అందులో సౌతాఫ్రికా తొమ్మిది మ్యాచ్‌ల‌లో విజ‌యం సాధించింది. మ‌రొక‌టి డ్రాగా ముగిసింది. ఇప్ప‌టివ‌ర‌కు ఎవ‌రూ ఈ ఫీట్ సాధించ‌లేక‌పోయారు. ఇంగ్లండ్‌కు చెందిన పెర్సీ చాప్‌మన్ కెప్టెన్‌గా  తొలి 10 మ్యాచ్‌ల‌లో తొమ్మిది విజ‌యాలు సాధించాడు. కానీ అందులో ఓ మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఓడిపోయింది.

బావుమా కెప్టెన్సీలో మాత్రం ద‌క్షిణాఫ్రికా తొలి 10 మ్యాచ్‌ల‌లో ఒక్క‌టి కూడా ఓడిపోలేదు. చాప్‌మన్  1926-31 మధ్య ఈ ఘనతను సాధించాడు. ఆసీస్ దిగ్గజం వార్విక్ ఆర్మ్ స్ట్రాంగ్ (1920-21) కూడా కెప్టెన్‌గా తొలి పది మ్యాచ్‌లలో ఓటమిని చవిచూడలేదు. కానీ అందులో 8 మ్యాచ్‌ల్లో విజయం సాధించగా, మరో రెండు మ్యాచ్‌లు డ్రాగా ముగిశాయి.
చదవండి: IND vs ENG: సెలక్టర్లకు స్వీట్ వార్నింగ్‌.. ఇంగ్లండ్ గడ్డపై సర్ఫరాజ్ సూపర్ సెంచరీ

Videos

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు