Breaking News

బాధపడొద్దు సార్‌.. ఈసారి కప్ తెలుగు టైటాన్స్‌దే!

Published on Wed, 10/29/2025 - 17:26

ప్రోకబడ్డీ లీగ్‌-2025లో తెలుగు టైటాన్స్ అద్భుత ప్రయాణం కొనసాగుతోంది. మంగళవారం ఢిల్లీ వేదికగా జరిగిన ఎలిమినేటర్ 3లో పాట్నా పైరేట్స్‌ను 46-39 తేడాతో చిత్తు చేసిన టైటాన్స్‌.. క్వాలిఫయర్‌-2 పోరుకు అర్హత సాధించింది. బుధవారం జరగనున్న క్వాలిఫయర్‌-2లో పుణేరి పల్టన్‌తో టైటాన్స్ అమీతుమీ తెల్చుకోనుంది.

కాగా  తొమ్మిదేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత టైటాన్స్ ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించడంలో ఆ జట్టు హెడ్ కోచ్ కృష్ణన్ కుమార్ హుడా కీలక పాత్ర.  ఈ ఏడాది సీజన్‌లో కృష్ణన్ కుమార్ పర్యవేక్షణలో టైటాన్స్ సంచలన ప్రదర్శన కనబరిచింది. లీగ్ దశలో వరుసగా ఐదు మ్యాచ్‌లలో విజయం సాధించిన తెలుగు టైటాన్స్‌.. ఇప్పుడు నాకౌట్స్‌లోనూ అదే జోరును కనబరుస్తోంది. మినీ-క్వాలిఫైయర్‌లో బెంగళూరును చిత్తు చేసిన టైటాన్స్‌.. ఎలిమినేటర్-3లో మూడుసార్లు ఛాంపియన్ అయిన పట్నా పైరేట్స్‌పై ఘన విజయం సాధించింది.

కన్నీరు పెట్టుకున్న కృష్ణన్ కుమార్..
కాగా ఎలిమినేటర్‌-3లో పాట్నాపై విజయం అనంతరం టైటాన్స్ హెడ్ కోచ్ కృష్ణన్ కుమార్ భావోద్వేగానికి లోనయ్యాడు. అధికారిక బ్రాడ్ క్రాస్ట‌ర్ స్టార్ స్పోర్ట్స్‌తో కృష్ణన్ మాట్లాడుతూ క‌న్నీటి ప‌ర్యంత‌మ‌య్యాడు.

"ఈ ఏడాది సీజ‌న్‌లో మా జ‌ట్టు అద్భుత‌మైన ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రుస్తోంది.  తొమ్మిది సీజన్ల తర్వాత ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించాము. ఇప్పుడు సెమీఫైన‌ల్‌(క్వాలిఫ‌య‌ర్‌-2) ఆడేందుకు సిద్ద‌మ‌య్యాము. ఇది మాకు డూ-ఆర్-డై మ్యాచ్. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి ఫైన‌ల్ పోరుకు అర్హ‌త సాధించేందుకు ప్ర‌య‌త్నిస్తాము.

 తెలుగు టైటాన్స్ ఇక్క‌డ వ‌రకు వ‌స్తుంద‌ని ఎవ‌రూ ఊహించి ఉండ‌రు. గ‌తంలో మమ్మ‌ల్ని ప్ర‌తీ జ‌ట్టు తేలిక‌గా తీసుకునేది. రెండు పాయింట్లు సులువ‌గా సాధించ‌వ‌చ్చు అని అనుకునేవాళ్లు. కానీ ఇప్పుడు ప్రతి జట్టు మమ్మల్ని చూసి భయపడుతోంది" అని హుడా పేర్కొన్నారు.

ఇందుకు సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల‌వుతోంది. ఇది చూసిన టైటాన్స్ అభిమానులు బాధ ప‌డొద్దు సార్‌.. ఈసారి క‌ప్ మ‌న‌దే అంటూ కామెంట్స్ పెడుతున్నారు. కాగా పీఎకేఎల్ చ‌రిత్ర‌లో టైటాన్స్ క్వాలిఫైయర్ మ్యాచ్ ఆడనుండ‌డం ఇదే తొలిసారి.
చదవండి: సూర్యకుమార్‌ యాదవ్‌ ప్రపంచ రికార్డు

Videos

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

Photos

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)