Breaking News

కోర్టు చెప్పినా మారరా?.. హెచ్‌సీఏపై టీసీఏ ధ్వజం

Published on Fri, 12/12/2025 - 15:00

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌లో అవినీతి జరుగుతూనే ఉందని తెలంగాణ క్రికెట్‌ అసోసియేషన్‌ ఆరోపించింది. ప్రీమియర్ లీగ్ పేరుతో మరోసారి మోసం చేయాలని చూస్తే హెచ్‌సీఏ అధికారులను బయట తిరగనివ్వబోమని హెచ్చరించింది. హెచ్‌సీఏలో అక్రమాల గురించి ప్రస్తావిస్తూ తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ (TCA)  శుక్రవారం మీడియా సమావేశం నిర్వహించింది.

అండర్ -14 టీమ్‌ అనే ప్రస్తావన లేదు
ఈ సందర్భంగా.. ‘‘ప్రీమియర్ లీగ్ పేరుతో మళ్లీ మోసం చేయాలని చూస్తే హెచ్‌సీఏ అధికారులను బయట తిరగ నివ్వం. ప్రీమియర్ లీగ్ కూడా TCA నిర్వహిస్తుంది. అండర్ 14 సెలక్షన్ పేరుతోనూ అవినీతి కి పాల్పడ్డారు. 3500 మంది క్రీడాకారులను ఇబ్బంది పెట్టారు. BCCIలో అసలు అండర్ -14 టీమ్‌ అనే ప్రస్తావన లేదు.

అయినా సెలక్షన్‌కు అని పిలిచి జింఖాన గ్రౌండ్ లో కనీసం సౌకర్యాలు కల్పించలేదు. సొంతం గా అసోసియేషన్‌లు పెట్టుకొని.. 15 మంది ని సెలెక్ట్ చేయడానికి  ఐదు వేల మంది ని నిలబెట్టారు. HCA అవకతవకలపై హ్యూమన్ రైట్స్‌​తో  పాటు డీజీపి కి ఫిర్యాదు చేస్తాం. ఎన్నిసార్లు కోర్టు మొట్టకాయలు వేసినా  HCA తీరులో మార్పు లేదు. మళ్లీ కోర్టును ఆశ్రయిస్తాం’’ అని టీసీఏ పేర్కొంది.

BCCI గుర్తింపు కోసం
టీసీఏ జనరల్‌ సెక్రటరీ గురువా రెడ్డి మాట్లాడుతూ.. BCCI గుర్తింపు కోసం మేము ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. ముఖ్యమంత్రి సుమోటోగా HCAపై విచారణ జరపాలి. BCCI నిబంధనలను HCA పాటించడం లేదు’’ అని పేర్కొన్నారు. ఇక అడ్వకేట్‌ కళ్యాణ్‌ మాట్లాడుతూ.. ‘‘సెలక్షన్‌ పేరిట పిల్లల్ని, వారి కుటుంబాలను ఇబ్బంది పెట్టారు. ఈ విషయంపై జాతీయ, రాష్ట్ర హ్యూమన్ రైట్స్ కు ఫిర్యాదు చేస్తున్నాం’’ అని తెలిపారు.

చదవండి: IND vs SA: ‘సూర్య’ గ్రహణం వీడేది ఎప్పుడు?

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)