Breaking News

రజత దీప్తి

Published on Sun, 09/28/2025 - 04:14

న్యూఢిల్లీ: తెలంగాణ పారా అథ్లెట్‌ జివాంజి దీప్తి ప్రపంచ పారా అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌లో రజత పతకంతో మెరిసింది. పారిస్‌ పారాలింపిక్స్‌లో పసిడి పతకం నెగ్గిన దీప్తి... తాజా పోటీల్లో రజతం ఖాతాలో వేసుకుంది. మహిళల 400 మీటర్ల పరుగు టి20 విభాగంలో బరిలోకి దిగిన దీప్తి శనివారం ఫైనల్లో 55.16 సెకన్లలో లక్ష్యాన్ని చేరి రెండో స్థానంలో నిలిచింది. ఈ సీజన్‌లో దీప్తికి ఇదే అత్యుత్తమ ప్రదర్శన కాగా... టర్కీకి చెందిన అయెసెల్‌ ఒండెర్‌ కొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పుతూ 54.51 సెకన్లలో గమ్యాన్ని చేరి పసిడి పతకం కైవసం చేసుకుంది. 

ఉక్రెయిన్‌ యులియా షులియర్‌ (56.20 సెకన్లు)కు కాంస్యం దక్కింది. న్యూఢిల్లీ వేదికగా శనివారం ఘనంగా ప్రారంభమైన వరల్డ్‌ అథ్లెటిక్స్‌ పోటీల్లో తొలి రోజు భారత్‌ ఖాతాలో మూడు పతకాలు చేరాయి. దీప్తి రజతం చేజిక్కించుకోగా... హై జంప్‌లో భారత అథ్లెట్లు రెండు పతకాలు కైవసం చేసుకున్నారు. 

పురుషుల హై జంప్‌ టి42 విభాగంలో శైలేశ్‌ కుమార్‌ స్వర్ణం గెలుచుకోగా... వరుణ్‌ సింగ్‌ కాంస్యం నెగ్గాడు. శైలేశ్‌ 1.91 మీటర్ల ఎత్తు దూకి అగ్రస్థానంలో నిలవగా... పారా ఆసియా క్రీడల పతక విజేత వరుణ్‌ సింగ్‌ 1.85 మీటర్లతో కాంస్యం నెగ్గాడు.  భారత్‌కే చెందిన రాహుల్‌ (1.78 మీటర్లు) నాలుగో స్థానంలో నిలిచాడు. 

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)