Breaking News

భారత్‌ X జింబాబ్వే

Published on Thu, 07/23/2026 - 03:40

హరారే: ఐర్లాండ్‌–ఇంగ్లండ్‌ పర్యటనలో స్థాయికి తగ్గ ప్రదర్శన కనబర్చలేకపోయిన భారత క్రికెట్‌ జట్టు... మరో టి20 పోరుకు సిద్ధమైంది. నేటి నుంచి జింబాబ్వేతో టీమిండియా మూడు మ్యాచ్‌ల సిరీస్‌ ఆడనుంది. శ్రేయస్‌ అయ్యర్‌ భారత టి20 జట్టు పగ్గాలు అందుకున్న తర్వాత ఒక్క మ్యాచ్‌లో కూడా విజయం సాధించలేకపోయిన టీమిండియా... ఈ సిరీస్‌లో ఎలాంటి ఆటతీరు కనబరుస్తుందో చూడాలి. సంజూ సామ్సన్‌ను ఈ సిరీస్‌కు ఎంపిక చేయకపోవడంతో మూడు మ్యాచ్‌ల్లోనూ అభిషేక్‌ శర్మతో కలిసి 15 ఏళ్ల వైభవ్‌ సూర్యవంశీ ఇన్నింగ్స్‌ ఆరంభించనున్నాడు. 

ఇంగ్లండ్‌ పర్యటనలో మూడు మ్యాచ్‌లు ఆడిన వైభవ్‌ 14, 13, 15 పరుగులు మాత్రమే చేశాడు. ఐపీఎల్‌లో దంచి కొట్టిన వైభవ్‌... జింబాబ్వేతో సిరీస్‌లో అయినా చెలరేగుతాడా చూడాలి. అండర్‌–19 ప్రపంచకప్‌ ఫైనల్లో ఇదే మైదానంలో భారీ సెంచరీ బాదిన వైభవ్‌ సీనియర్‌ స్థాయిలో రాణించాల్సిన అవసరముంది. ఇషాన్‌ కిషన్, శ్రేయస్‌ అయ్యర్, తిలక్‌ వర్మ, రింకూ సింగ్, శివమ్‌ దూబేతో మిడిలార్డర్‌ పటిష్టంగా ఉంది. అయితే వీరంతా సమష్టిగా రాణించాల్సి ఉంది. 

బౌలింగ్‌లో అనుభవలేమి కొట్టొచ్చినట్లు కనిపిస్తుండగా... ప్రిన్స్‌ యాదవ్, మయాంక్‌ యాదవ్‌ కీలకం కానున్నారు. పేస్‌ ఆల్‌రౌండర్‌ సూర్యాషే షెడ్గే కంటే... స్పిన్నర్‌ హర్ష్ దూబేకే తుది జట్టులో చోటు దక్కే అవకాశాలు ఎక్కువ. గత జింబాబ్వే పర్యటనలో శతకంతో సత్తా చాటిన అభిషేక్‌ శర్మపై భారీ అంచనాలు ఉన్నాయి. గౌతమ్‌ గంభీర్‌ స్థానంలో ఈ సిరీస్‌కు వీవీఎస్‌ లక్ష్మణ్‌ భారత హెడ్‌ కోచ్‌గా బాధ్యతలు నిర్వర్తించనున్నాడు. 

మరోవైపు సికందర్‌ రజా సారథ్యంలోని జింబాబ్వే జట్టులో బెనెట్, మరుమని, మధెవెరె, బర్ల్, ఇవాన్స్, మసకద్జ రూపంలో నైపుణ్యం గల ఆటగాళ్లు ఉన్నారు. బౌలింగ్‌లో ఐపీఎల్‌ అనుభవం ఉన్న బ్లెస్సింగ్‌ ముజరబానితో భారత బ్యాటింగ్‌ ఆర్డర్‌కు ముప్పు పొంచి ఉంది. పిచ్‌ పేసర్లకు సహకరించనుంది. కుదురుకుంటే పరుగులు చేయడం పెద్ద కష్టం కాదు. మ్యాచ్‌కు వర్ష సూచన లేదు. 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)