Breaking News

టీమిండియా చరిత్ర సృష్టించేనా..?

Published on Sun, 01/29/2023 - 15:35

ICC Under 19 Womens T20 World Cup 2023: సౌతాఫ్రికా గడ్డపై జరుగుతున్న తొట్టతొలి ఐసీసీ అండర్‌-19 మహిళల టీ20 ప్రపం‍చకప్‌ తుది అంకానికి చేరుకుంది. ఈ మెగా టోర్నీలో భారత్‌,ఇంగ్లండ్‌ జట్టు తుది సమరానికి అర్హత సాధించాయి. ఇంగ్లండ్‌.. ఆస్ట్రేలియాను, భారత్‌.. న్యూజిలాండ్‌ను సెమీస్‌లో మట్టికరిపించి ఫైనల్‌కు చేరాయి. భారతకాలమానం ప్రకారం​ ఇవాళ (జనవరి 29) సాయంత్రం 5:15 గంటలకు ప్రారంభమయ్యే ఫైనల్‌ మ్యాచ్‌లో ఏ జట్టు గెలిచినా చరిత్రే అవుతుంది.

టోర్నీలో భారత, ఇంగ్లండ్‌ జట్ల ప్రస్థానాన్ని గమనిస్తే.. ఇరు జట్లు పోటాపోటీగా ప్రత్యర్ధులపై పైచేయి సాధించి, తుది సమరానికి అర్హత సాధించాయి. గ్రూప్‌ దశలో ఇరు జట్లు ఆడిన అన్ని మ్యాచ్‌ల్లో విజయాలు సాధించి, సూపర్‌ సిక్స్‌ దశకు అర్హత సాధించాయి. ఈ దశలోనూ ఇరు జట్లు గ్రూప్‌ టాపర్‌లుగా నిలిచి సెమీస్‌కు చేరుకున్నాయి. సెమీస్‌లో యువ భారత జట్టు న్యూజిలాండ్‌పై 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించగా.. ఇంగ్లండ్‌ అతికష్టం మీద ఆసీస్‌ను 3 పరుగుల తేడాతో ఓడించింది.

ఇక వ్యక్తిగత ప్రదర్శనల విషయానికొస్తే.. టీమిండియా ఓపెనర్లు శ్వేత సెహ్రావత్‌, షెఫాలీ వర్మ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నారు. వీరిద్దరు పోటాపోటీగా పరుగులు సాధించి, టోర్నీలో అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్ల జాబితాలో 1 (శ్వేత, 6 మ్యాచ్‌ల్లో 146 సగటున 3 అర్ధసెంచరీల సాయంతో 292 పరుగులు), 4 (షెఫాలీ, 6 మ్యాచ్‌ల్లో ఒక​అర్ధసెంచరీ సాయంతో 157 పరుగులు) స్థానాల్లో నిలిచారు.

బౌలింగ్‌లోనూ భారత లెగ్‌ స్పిన్నర్‌ పర్షవి చోప్రా అద్భుతమైన ఫామ్‌లో ఉంది. ఈ అమ్మాయి 5 మ్యాచ్‌ల్లో 9 వికెట్లు పడగొట్టి జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషించింది. మరో స్పిన్నర్‌ మన్నత్‌ కశ్యప్‌ కూడా ఈ టోర్నీలో అదరగొడుతోంది. ఈ అమ్మాయి ఇప్పటివరకు ఆడిన 5 మ్యాచ్‌ల్లో 8 వికెట్లు పడగొట్టింది. 
 

Videos

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

నామినేషన్లు వేయనివ్వడం లేదు.. SP కి ఫోన్ చేసిన రవీంద్రనాథ్ రెడ్డి..

మా టైమ్ వచ్చాక కొట్టే దెబ్బ ఎలా ఉంటుందంటే! మాస్ వార్నింగ్

సెక్యూరిటీ ఇస్తాం అని పిలిచి... లాఠీ ఛార్జ్ పై రాచమల్లు సంచలన కామెంట్స్

మంచు కొండల్లో మొదలైన విధ్వంసం.. రష్యాలో 7 తీవ్రతతో భూకంపం!

YS జగన్ విజువల్స్ @గన్నవరం ఎయిర్ పోర్ట్

తాడిపత్రిలో ఎన్నికల టెన్షన్.. YSRCP జాఫర్ ను కిడ్నాప్ చేసిన జేసీ వర్గీయులు

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)