బంగ్లాతో తొలి టెస్టు.. ప్రాక్టీస్‌లో టీమిండియా ఆటగాళ్లు

Published on Sun, 09/15/2024 - 08:18

ఈ సీజన్‌లో శుభారంభం చేసేందుకు భారత క్రికెట్‌ జట్టు ప్రాక్టీస్‌లో చెమటోడ్చుతోంది. బంగ్లాదేశ్‌తో రెండు టెస్టుల ముఖాముఖి సిరీస్‌లో పాల్గొనేందుకు రోహిత్‌ శర్మ బృందం సిద్ధమవుతోంది. బంగ్లాదేశ్‌లోని కీలక బౌలర్లను సమర్థంగా ఎదుర్కోనేందుకు టీమిండియా కసరత్తు చేస్తోంది. 

ఇందులో భాగంగా బంగ్లా స్పీడ్‌స్టర్‌ నహిద్‌ రాణా శైలీని పోలిన పంజాబ్‌ పేసర్‌ గుర్నూర్‌ బ్రార్‌ను నెట్‌బౌలర్‌గా వినియోగించుకుంటుంది. 6 అడుగుల 5 అంగుళాల ఎత్తున్న నహిద్‌ పాక్‌ గడ్డపై చెలరేగాడు. బంగ్లాదేశ్‌ క్లీన్‌స్వీప్‌లో కీలకభూమిక పోషించాడు.

ఈ నేపథ్యంలో 6 అడుగుల 4.5 అంగుళాల పొడగరి పేసర్‌ గుర్నూర్‌ బంతుల్ని రోహిత్, కోహ్లి తదితర బ్యాటర్లు అదేపనిగా ప్రాక్టీస్‌ చేస్తున్నారు. వెటరన్‌ బౌలర్‌ అశ్విన్‌ స్పిన్‌ వేయగల తమిళనాడు లెఫ్టార్మ్‌ స్పిన్నర్‌ అజిత్‌ రామ్‌ కూడా నెట్స్‌లో బ్యాటర్లకు అందుబాటులో ఉన్నాడు.

చెన్నై పిచ్‌ ఇటు పేసర్లు, అటు స్పిన్నర్లకు సమాన అవకాశాలు కల్పించనుండటంతో జట్టు మేనేజ్‌మెంట్‌ తుదిజట్టు కూర్పుపై త్వరలోనే కసరత్తు పూర్తిచేయనుంది. మరోవైపు బంగ్లాదేశ్‌ ఆదివారం ఢాకా నుంచి నేరుగా చెన్నైకి చేరుకోనుంది. 
చదవండి: Diamond League: నీరజ్‌ చోప్రాకు షాక్‌.. సెంటీమీటర్‌ తేడాతో టైటిల్‌ మిస్‌

Videos

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

Photos

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)