Breaking News

T20 WC 2024: టీమిండియా టీ20 వరల్డ్​ కప్​ జెర్సీ ఇదే.. ఫోటోలు వైర‌ల్‌

Published on Mon, 05/06/2024 - 20:48

టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌-2024 ప్రారంభానికి మ‌రో ఐదు వారాల స‌మ‌యం మాత్రమే మిగిలి ఉంది. జూన్ 1 నుంచి అమెరికా, వెస్టిండీస్‌ల వేదిక‌గా ఈ మెగా టోర్నీ షురూ కానుంది. ఈ మెగా ఈవెంట్‌కు స‌మ‌యం ద‌గ్గ‌ర‌ప‌డ‌తుండ‌డంతో క్రికెట్ బోర్డులు  ఒక్కొక్క‌టిగా త‌మ జ‌ట్ల జెర్సీలను రిలీజ్ చేస్తున్నాయి.

ఈ క్ర‌మంలో టీమిండియా వ‌ర‌ల్డ్‌క‌ప్ జెర్సీని బీసీసీఐ రివీల్‌ చేసింది. భారత క్రికెట్ జట్టు అధికారిక స్పాన్సర్ అడిడాస్‌ జెర్సీ రిలీజ్‌కు సంబంధించిన వీడియోను ఎక్స్‌లో పోస్ట్ చేసింది.

టీమిండియా జెర్సీలో.. వీ షేప్​ నెక్​కి ట్రై కలర్​ స్ట్రిప్స్​ ఉన్నాయి.  ఈసారి జెర్సీలో బ్లూతో పాటు కాషాయం రంగు కూడా ఉంది. అడిడాస్​కి చెందిన లోగో.. జెర్సీ కుడివైపు ఉంది.

బీసీసీఐ లోగో ఎడమవైపు ఉంది. అయితే ఈ ఫోటోలు చూసిన‌ నెటిజ‌న్లు జెర్సీ బాగొలేదంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇక ఈ మెగా టోర్నీలో టీమిండియా త‌మ తొలి మ్యాచ్‌లో జూన్‌5 న ఐర్లాండ్‌తో త‌ల‌ప‌డ‌నుంది.

ఇక పొట్టి ప్ర‌పంచ‌క‌ప్ కోసం 15 మంది స‌భ్యుల‌తో కూడిన‌ భార‌త జ‌ట్టును బీసీసీఐ ఇటీవ‌లే ప్ర‌క‌టించింది. ఈ జ‌ట్టులో కేఎల్ రాహుల్‌, రింకూ సింగ్‌, శుబ్‌మ‌న్ గిల్ వంటి స్టార్ క్రికెట‌ర్లకు చోటు ద‌క్క‌లేదు.

టీ20 వరల్డ్​ కప్ భార‌త‌​ జట్టు: రోహిత్​ శర్మ (కెప్టెన్​), హర్దిక్​ పాండ్యా (వైస్​ కెప్టెన్​), యశస్వీ జైశ్వాల్​, విరాట్​ కోహ్లీ, సూర్యకుమార్​ యాదవ్​,రిషభ్​ పంత్​, సంజూ శాంసన్‌ , శివమ్​ దూబే, రవీంద్ర జడేజా, అక్షర్​ పటేల్​, కుల్దీప్​ యాదవ్​, యుజ్వేందర్​ చాహల్​, ఆర్షదీప్​ సింగ్​, జస్ప్రీత్​ బుమ్రా, మహమ్మద్​ సిరాజ్​.

రిజర్వ్​ ఆటగాళ్లు: శుభ్​మాన్​ గిల్​, రింకు సింగ్​, ఆవేశ్​ ఖాన్​, ఖలీల్​ అహ్మద్​
 

Videos

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)