Breaking News

'డ్రీమ్ 11తో బంధం ముగిసింది'.. బీసీసీఐ అధికారిక ప్రకటన

Published on Mon, 08/25/2025 - 12:47

భార‌త క్రికెట్ జ‌ట్టుకు  జెర్సీ స్పాన్సర్​గా ఉన్న ఫ్యాంట‌సీ గేమ్ ఫ్లాట్ ఫామ్‌ డ్రీమ్ 11(Dream11)తో బీసీసీఐ ఒప్పందం ర‌ద్దు చేసుకుంది. 'ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ ఆన్‌లైన్ గేమింగ్ బిల్లు-2025 పార్లమెంటులో ఆమోదం పొందిన నేపథ్యంలో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.

ఈ విషయాన్ని బీసీసీఐ  కార్యదర్శి దేవజిత్ సైకియా ధ్రువీకరించారు. దీంతో సెప్టెంబర్ 9న ప్రారంభం కానున్న ఆసియా కప్‌లో టీమిండియా స్పాన్సర్ లేకుండానే ఆడనుంది. కాగా ఈ  ఆన్‌లైన్ గేమింగ్ బిల్లును ఆగస్టు 20న లోక్‌సభ,  21న రాజ్యసభ ఆమోదించింది.

ఆ తర్వాత రాష్ట్రపతి  ద్రౌపది ముర్ము సంతకం చేయడంతో ఈ బిల్ ఇప్పుడు చట్టంగా మారింది. ఫలితంగా భారత జట్టుకు జెర్సీ స్పాన్పర్ లేకుండా పోయింది. కొత్త స్పాన్సర్స్ కోసం బీసీసీఐ త్వరలోనే టెండర్లను ఆహ్హానించనున్నట్లు  ఇండియన్ ఎక్స్‌ప్రెస్ తమ కథనంలో పేర్కొంది.

"ఆన్‌లైన్ గేమింగ్ ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ బిల్లు- 2025 ఆమోదించబడిన తర్వాత బీసీసీఐ-డ్రీమ్ 11 మధ్య సంబంధాలను నిలిపివేస్తున్నాము. భవిష్యత్తులోనూ ఇలాంటి సంస్థలతో ఒప్పందం కుదుర్చుకోమని" దేవజిత్ సైకియా న్యూస్ ఏజెన్సీ ఎఎన్‌ఐతో పేర్కొన్నారు. 

2023లో రూ. 358 కోట్లతో మూడేళ్ల కాలానికి బీసీసీఐతో ‘డ్రీమ్‌ 11’ ఒప్పందం కుదుర్చుకుంది.  ఎడ్-టెక్ దిగ్గజం బైజూస్‌ను  ‘డ్రీమ్‌ 11’  భర్తీ చేసింది. ఇప్పుడు ప్రభుత్వం నిర్ణయంతో డ్రీమ్ 11 అగ్రిమెంట్ మధ్యలోనే  క్యాన్సిల్ అయింది.

ఇప్పుడు డ్రీమ్ 11 మధ్యలోనే నిష్క్రమించినప్పటి.. ఈ సంస్థపై భారత క్రికెట్‌ మండలి ఎలాంటి జరిమానా విధించడం లేదట. ఒప్పందం ప్రకారం చట్టపరమైన కారణాలతో మధ్యలో స్పాన్సర్‌షిప్‌ను వదిలేసినా.. ఎలాంటి జరిమానా పడకుండా నిబంధన ఉన్నట్లు పలు రిపోర్ట్‌లు పేర్కొంటున్నాయింది.

#

Tags : 1

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)