Breaking News

"గౌతమ్‌ గంభీర్‌ను చంపేస్తాం".. ఐసిస్‌ బెదిరింపులు

Published on Thu, 04/24/2025 - 10:03

భారత క్రికెట్ జట్టు హెడ్ కోచ్, బీజేపీ మాజీ ఎంపీ గౌతమ్ గంభీర్‌కు ఉగ్రవాద సంస్థ ఐసిస్‌ కశ్మీర్‌ నుంచి బెదిరింపులు వచ్చాయి. హతమారుస్తామంటూ (IKILLU) ఐసిస్‌ కశ్మీర్ రెండు ఈ-మెయిల్స్‌ చేసింది. ఈ విషయాన్ని గంభీర్‌ వెంటనే పోలీసుల దృష్టికి తీసుకెళ్లాడు. 

ఢిల్లీలోని రాజీందర్‌నగర్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసిన పోలీసులు విచారణ ప్రారంభించారు. పహల్గామ్ ఉగ్రదాడిపై స్పందించినందుకు గంభీర్‌కు బెదిరింపులు వచ్చినట్లు తెలుస్తుంది. తనకు, తన కుటుంబ సభ్యులకు రక్షణ కల్పించాలని గంభీర్‌ ఢిల్లీ పోలీసులను కోరాడు.

గంభీర్‌ పహల్గామ్ ఉగ్రదాడిపై స్పందిస్తూ తన సోషల్ మీడియా ఖాతాలో రాసుకొచ్చాడు. మృతుల కుటుంబాల కోసం ప్రార్థిస్తున్నాను. దీనికి బాధ్యులు మూల్యం చెల్లించుకుంటారు. భారత్ ప్రతీకారం తీర్చుకుంటుందని పేర్కొన్నాడు.

కాగా, ఐపీఎల్‌ కారణంగా గంభీర్‌ ప్రస్తుతం ఖాళీగా ఉన్నాడు. గంభీర్‌ ఇటీవలే కుటుంబంతో కలిసి ఫ్రాన్స్‌లో హాలిడే ఎంజాయ్‌ చేసి వచ్చాడు. గంభీర్‌ గతేడాది జులైలో టీమిండియా హెడ్‌ కోచ్‌గా బాధ్యతలు చేపట్టాడు. భారత్‌ టీ20 వరల్డ్‌కప్‌ గెలిచాక రాహుల్‌ ద్రవిడ్‌ నుంచి బాధ్యతలు స్వీకరించాడు. 

టీమిండియా కోచ్‌గా గంభీర్‌కు మిశ్రమ ఫలితాలు వచ్చాయి. గంభీర్‌ నేతృత్వంలో భారత్‌.. శ్రీలంక చేతిలో వన్డే సిరీస్, న్యూజిలాండ్‌ చేతిలో టెస్ట్ సిరీస్, ఆస్ట్రేలియా చేతిలో బోర్డర్-గవాస్కర్ సిరీస్‌ల్లో ఓటమిపాలైంది.  మధ్యలో కొన్ని చిన్నాచితక విజయాలతో పాటు భారత్‌ గంభీర్‌ నేతృత్వంలో ఐసీసీ ఛాంపియన్స్‌ ట్రోఫీని గెలిచింది.

 

 

 

 

Videos

విజయవాడ మేయర్ నాదే.. రాయన భాగ్యలక్ష్మి వైరల్ కామెంట్స్

మీ కంటే YSRCP నయం.. 40 సంవత్సరాలు TDPకి పని చేసినందుకు మీరు నాకు ఇచ్చిన గిఫ్ట్ ఇదా..!

లక్షకు 42 లక్షల లాభం.. రాకెట్ లా దూసుకెళ్తున్న షేర్

ఫై దుబాయ్ ఘటనలో.. భయానక అనుభవాలు.. బయటపెట్టిన పైలట్ స్మిత్ మచ్చర్

తమన్నాతో బ్రేకప్.. మళ్లీ ఆమెతో డేటింగ్.!

అగ్నిగుండంగా పారిస్.. చారిత్రక భవనానికి నిప్పు

టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. లారెన్స్ బిష్ణోయ్ సంచలన ప్రకటన

వైఎస్సార్ జిల్లాలో ఉద్రిక్తత.. YSRCP ఛైర్మన్ అభ్యర్థి పోరెడ్డి ఇంటిపై టీడీపీ దాడి

జియో IPO సంచలనం

బాబుకు దిమ్మతిరిగేలా.. పక్కా ఆధారాలతో SECకి ఫిర్యాదు

Photos

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)