Breaking News

ముమ్మర సాధనలో...

Published on Tue, 09/17/2024 - 06:10

చెన్నై: టీమిండియా ప్రాక్టీస్‌లో తలమునకలై శ్రమిస్తోంది. బంగ్లాదేశ్‌తో తొలి టెస్టు కోసం తీవ్రంగా సాధన చేస్తోంది. నిజానికి భారత్‌ స్థాయితో పోల్చుకుంటే బంగ్లాదేశ్‌ ఏమంత గట్టి ప్రత్యర్థి కానప్పటికీ... ఇటీవల పాకిస్తాన్‌లో పర్యటించిన బంగ్లాదేశ్‌ 2–0తో క్లీన్‌స్వీప్‌ చేసింది. ఈ నేపథ్యంలో కొత్త సీజన్‌లో ఎలాంటి ఆదమరుపునకు తావివ్వకుండా భారత ఆటగాళ్లు చెమటోడ్చుతున్నారు. సోమ వారం పూర్తిస్థాయిలో 16 మంది జట్టు సభ్యులంతా ప్రాక్టీస్‌ చేశారు. 

కోహ్లి నెట్స్‌లో ఎక్కువసేపు బ్యాటింగ్‌ చేశాడు. తర్వాత యువ సంచలనం యశస్వి జైస్వాల్‌ సాధనకు దిగాడు. ఇద్దరు చాలాసేపు వైవిధ్యమైన బంతుల్ని ఎదుర్కొనేందుకు ఆసక్తి చూపారు. భారత స్పీడ్‌స్టర్‌ బుమ్రా, స్థానిక వెటరన్‌ స్పిన్నర్‌ అశ్విన్‌ వాళ్లిద్దరికి బంతులు వేశారు. బుమ్రా బౌలింగ్‌లో షాట్లు ఆడే ప్రయత్నంలో జైస్వాల్‌ పలుమార్లు బౌల్డయ్యాడు.

 ఆ తర్వాత కెపె్టన్‌ రోహిత్, ఓపెనర్‌ శుబ్‌మన్‌ గిల్, సర్ఫరాజ్‌ ఖాన్‌లు బ్యాటింగ్‌ ప్రాక్టీస్‌ చేశారు. అనంతపురంలో దులీప్‌ ట్రోఫీ మ్యాచ్‌ అయిపోగానే సర్ఫరాజ్‌ జట్టుతో కలిశాడు. సారథి రోహిత్‌ శర్మ ప్రధానంగా స్పిన్నర్లను ఎదుర్కోనేందుకు మొగ్గు చూపాడు. చాలాసేపు స్పిన్‌ బంతులపైనే ప్రాక్టీస్‌ చేశాడు. రవీంద్ర జడేజా, రిషభ్‌ పంత్‌లు కూడా త్రోడౌన్‌ స్పెషలిస్టుల బంతుల్ని ఆడారు. సోమవారంతో భారత్‌ జట్టు మూడు ప్రాక్టీస్‌ సెషన్లను పూర్తి చేసుకుంది. మ్యాచ్‌కు మూడు రోజుల సమయం ఉండటంతో మరో రెండు సెషన్లు ఆటగాళ్లు ప్రాక్టీస్‌లో గడపనున్నారు.  

ముగ్గురు స్పిన్నర్లతో... 
చెపాక్‌ పిచ్‌ స్పిన్నర్లకు స్వర్గధామం కావడంతో భారత్‌ ఇద్దరు పేసర్లు, ముగ్గురు స్పెషలిస్టు స్పిన్నర్లతో బరిలోకి దిగే అవకాశముంది. అనుభవజు్ఞలైన అశి్వన్, జడేజాలతో కుల్దీప్‌ యాదవ్‌కు తుది జట్టులో దాదాపు బెర్త్‌ ఖాయమనిపిస్తోంది. దీంతో బ్యాటింగ్‌లోనూ మెరిపిస్తున్న స్పిన్‌ ఆల్‌రౌండర్‌ అక్షర్‌ పటేల్‌కు ఈ మ్యాచ్‌లో చోటు లేనట్లే! పేసర్ల విషయానికొస్తే బుమ్రాతో సిరాజ్‌ బంతిని పంచుకుంటాడు. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌లో భాగమైన ఈ రెండు టెస్టుల ద్వైపాక్షిక సిరీస్‌లో తొలి టెస్టు ఎంఎ చిదంబరం మైదానంలో గురువారం నుంచి జరుగుతుంది.  

బంగ్లాదేశ్‌ ఆటగాళ్లు కూడా... ఆదివారం చెన్నై చేరుకున్న బంగ్లాదేశ్‌ జట్టు క్రికెటర్లు కూడా సోమవారం నెట్‌ ప్రాక్టీస్‌లో పాల్గొన్నారు. పాక్‌ను వారి  సొంతగడ్డపై వైట్‌వాష్‌ చేసి ఊపు మీదున్న బంగ్లాదేశ్‌... ప్రపంచ రెండో ర్యాంకర్‌ భారత్‌ను ఓడించడమే లక్ష్యంగా నెట్స్‌లో చెమటోడ్చుతోంది. బ్యాటర్లు లిటన్‌ దాస్, ముష్ఫికర్‌ రహీమ్, మహ్ముదుల్‌ హసన్, జాకిర్‌ హసన్, షాద్‌మన్‌ ఇస్లామ్‌లు భారీషాట్లపై కసరత్తు చేశారు. త్రోడౌన్‌ స్పెషలిస్టులపై స్ట్రెయిట్‌ డ్రైవ్‌ షాట్లు ఆడారు. స్పిన్నర్లకు కలిసొచ్చే చెన్నై పిచ్‌పై సత్తా చాటేందుకు తైజుల్‌ ఇస్లామ్, నయీమ్‌ హసన్‌లు బౌలింగ్‌ ప్రాక్టీస్‌ చేశారు.
 

Videos

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)