Breaking News

Viral Video: టీమిండియా దీపావళి సంబురాలు అదుర్స్‌

Published on Sun, 11/12/2023 - 18:26

వన్డే ప్రపంచకప్‌-2023లో వరుస విజయాలతో (8) దూసుకుపోతున్న టీమిండియా.. నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌కు ముందు దీపావళి సంబురాల్లో పాల్గొంది. బెంగళూరులోని విలాసవంతమైన ఐటీసీ గార్డెనియా హోటల్‌లో జరిగిన ఈ వేడుకల్లో భారత క్రికెట్‌ జట్టు సభ్యులందరూ పాల్గొన్నారు. ఆహ్లాదభరితమైన వాతావరణంలో సాగిన ఈ వేడుకల్లో టీమిండియా ఆటగాళ్లు కుటుంబ సభ్యుల్లా మమేకమై ఎంజాయ్‌ చేశారు.

ఈ వేడుకల్లో విరాట్‌-అనుష్క దంపతులు స్పెషల్‌ అట్రక్షన్‌గా నిలిచారు. రోహిత్‌, కేల్‌ రాహుల్‌, జడేజా, శార్దూల్‌, సూర్యకుమార్‌ సతీసమేతంగా ఈ వేడుకలకు హాజరయ్యారు. ఈ వేడుకల్లో శుభ్‌మన్‌ గిల్‌, ఇషాన్‌ కిషన్‌ చిన్న పిల్లాలలా సందడి చేశారు.  

టీమిండియా దీపావళి సంబురాలకు సంబంధించిన వీడియోను బీసీసీఐ సోషల్‌మీడియాలో షేర్‌ చేసింది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరలవుతుంది. ఈ వీడియోలో టీమిండియా ఆటగాళ్లను చూసేందుకు రెండు కళ్లు చాలవని నెటిజన్లు అంటున్నారు. 

ఇదిలా ఉంటే, నెదర్లాండ్స్‌తో ఇవాళ జరుగుతున్న మ్యాచ్‌లో టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన టీమిండియా భారీ స్కోర్‌ చేసింది. కేఎల్‌ రాహుల్‌ (63 బంతుల్లో 102; 11 ఫోర్లు, 4 సిక్సర్లు), శ్రేయస్‌ అయ్యర్‌ (94 బంతుల్లో 128 నాటౌట్‌; 10 ఫోర్లు, 5 సిక్సర్లు) మెరుపు శతకాలతో విరుచుకుపడటంతో పాటు రోహిత్‌ శర్మ (61), శుభ్‌మన్‌ గిల్‌ (51), విరాట్‌ కోహ్లి (51) హాఫ్‌ సెంచరీలతో రాణించడంతో భారత్‌ నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 410 పరుగులు చేసింది. 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)