Breaking News

టెస్టుల్లో నంబర్‌వన్‌గా టీమిండియా

Published on Tue, 05/02/2023 - 14:17

ఐసీసీ ఇవాళ (మే 2) విడుదల చేసిన ఎంఆర్‌ఎఫ్‌ వార్షిక టెస్ట్‌ ర్యాంకింగ్స్‌లో టీమిండియా నంబర్‌వన్ స్థానానికి ఎగబాకింది. రెండో ప్లేస్‌లో ఉండిన రోహిత్‌ సేన.. ఆస్ట్రేలియాను వెనక్కునెట్టి అగ్రపీఠాన్ని అధిరోహించింది. 15 నెలలుగా అగ్రపీఠంపై కర్చీఫ్‌ వేసుకుని కూర్చున్న ఆసీస్‌.. టీమిండియా దెబ్బకు కొండ దిగాల్సి వచ్చింది.

వచ్చే నెలలో (జూన్‌ 7)  జరుగనున్న వరల్డ్‌ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌కు ముందు భారత్‌కు ఇది (టాప్‌ ర్యాంక్‌) మంచి బూస్టప్‌ ఇవ్వనుంది. ఇంగ్లండ్‌ వేదికగా ఆస్ట్రేలియా- టీమిండియా మధ్య టైటిల్‌ కోసం పోరు జరుగనున్న విషయం తెలిసిందే. ఇక ఇప్పటికే స్వదేశంలో బోర్డర్‌- గావస్కర్‌ ట్రోఫీలో ఆసీస్‌ను మట్టికరిపించి.. డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరింది రోహిత్‌ సేన. ఇక ఇపుడు ఏకంగా నంబర్‌ 1గా అవతరించి మరోసారి అభిమానులను ఖుషీ చేసింది.

ఇదిలా ఉంటే.. ఐసీసీ వార్షిక ర్యాంకింగ్స్‌లో భారత్‌ (121), ఆస్ట్రేలియా (116) తర్వాత ఇంగ్లండ్‌ (114), సౌతాఫ్రికా (104), న్యూజిలాండ్‌ (100), పాకిస్థాన్‌ (86), శ్రీలంక (84), వెస్టిండీస్‌ (76), బంగ్లాదేశ్‌ (45), జింబాబ్వే (32) వరుసగా 3 నుంచి 10 స్థానాల్లో నిలిచాయి. 

కాగా, వార్షిక ర్యాంకింగ్‌లకు ఇప్పటివరకు జరిగిన మ్యాచ్‌లతో పాటు 2020 మే- 2022 మే మధ్యలో జరిగిన సిరీస్‌లను కూడా పరిగణనలోకి తీసుకుంటారు. 20-22 మధ్యలో పూర్తైన సిరీస్‌లకు 50 శాతం, ఆతర్వాత జరిగిన సిరీస్‌లకు 100 శాతం పాయింట్లు కేటాయిస్తారు.

20-22 మధ్యలో ఆసీస్‌ గెలిచిన సిరీస్‌లకు తక్కువ వెయిటేజ్‌ ఉండటంతో ఆసీస్‌ 5 పాయింట్లు కోల్పోయి (121 నుంచి 116 పాయింట్ల) ఒకటి నుంచి రెండో స్థానానికి పడిపోయింది. ఫలితంగా టీమిండియాకు ర్యాంకింగ్స్‌లో అ‍గ్రస్థానం లభించింది.  
 

Videos

లక్షకు 42 లక్షల లాభం.. రాకెట్ లా దూసుకెళ్తున్న షేర్

ఫై దుబాయ్ ఘటనలో.. భయానక అనుభవాలు.. బయటపెట్టిన పైలట్ స్మిత్ మచ్చర్

తమన్నాతో బ్రేకప్.. మళ్లీ ఆమెతో డేటింగ్.!

అగ్నిగుండంగా పారిస్.. చారిత్రక భవనానికి నిప్పు

టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. లారెన్స్ బిష్ణోయ్ సంచలన ప్రకటన

వైఎస్సార్ జిల్లాలో ఉద్రిక్తత.. YSRCP ఛైర్మన్ అభ్యర్థి పోరెడ్డి ఇంటిపై టీడీపీ దాడి

జియో IPO సంచలనం

బాబుకు దిమ్మతిరిగేలా.. పక్కా ఆధారాలతో SECకి ఫిర్యాదు

రెండో టీ20లో భారత మహిళా జట్టు విజయం

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

Photos

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)