Breaking News

రోహిత్‌ శర్మ సన్నద్ధత

Published on Wed, 08/13/2025 - 03:53

ముంబై: భారత వన్డే కెప్టెన్‌ రోహిత్‌ శర్మ కొంత విరామం తర్వాత మళ్లీ క్రికెట్‌ మైదానంలోకి దిగేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ క్రమంలో ఫిట్‌నెస్‌కు పదును పెడుతున్నాడు. తన మిత్రుడు, వ్యక్తిగత కోచ్‌ అయిన అభిషేక్‌ నాయర్‌తో కలిసి అతను మంగళవారం జిమ్‌ ట్రైనింగ్‌లో పాల్గొన్నాడు. రోహిత్‌ ఇప్పటికే టెస్టులు, టి20లనుంచి రిటైర్‌ కావడం, అన్ని ఫార్మాట్‌లలో కొత్త ఆటగాళ్లు సత్తా చాటుతుండటంతో వన్డేల్లో కూడా అతను కొనసాగే అంశంపై ఇటీవల చర్చ మొదలైంది. 

2027 వన్డే వరల్డ్‌ కప్‌లో ఆడాలనే లక్ష్యంతో రోహిత్‌ ఉన్నా... ఇప్పటికిప్పుడు దీనిపై ఇంకా స్పష్టత వచ్చే అవకాశం లేదు. ఈ నేపథ్యంలో నాయర్‌ పర్యవేక్షణలోనే రోహిత్‌ త్వరలోనే నెట్స్‌లో బ్యాటింగ్‌ ప్రాక్టీస్‌కు దిగే అవకాశం ఉంది. అతను చివరిసారిగా జూన్‌ 1న ఐపీఎల్‌ మ్యాచ్‌ ఆడాడు. 

ఆ తర్వాత భారత టెస్టు జట్టు ఇంగ్లండ్‌లో పర్యటించగా... రోహిత్‌ కూడా అదే సమయంలో ఇంగ్లండ్‌లోనే సరదాగా సెలవులు గడిపాడు. ఇప్పుడు విరామం తర్వాత మళ్లీ క్రికెట్‌పై దృష్టి పెట్టాడు. భారత్‌ తమ తర్వాతి వన్డేలో అక్టోబర్‌ 19న ఆ్రస్టేలియాలో బరిలోకి దిగుతుంది. 2025–26 సీజన్‌లో టీమిండియా మరో 9 వన్డే మ్యాచ్‌లు మాత్రమే ఆడనుంది. 

ఆసీస్‌ టూర్‌తో పాటు స్వదేశంలోనే దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్‌లతో భారత్‌ తలపడుతుంది. భవిష్యత్తు సంగతి ఎలా ఉన్నా... ప్రస్తుతానికి రోహిత్‌ వన్డేల్లో టాప్‌ బ్యాటర్‌గానే కొనసాగుతున్నాడు. 11,168 పరుగులు మాత్రమే కాదు, 32 సెంచరీలు, మూడు డబుల్‌ సెంచరీలతో అతనికి ఘనమైన రికార్డు ఉంది. భారత్‌ ఆడిన తమ చివరి టోర్నీ చాంపియన్స్‌ ట్రోఫీలో కెపె్టన్‌గా జట్టును విజేతగా నిలపడంతో పాటు ఫైనల్లో రోహిత్‌ స్వయంగా ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’గా నిలిచిన విషయం గమనార్హం.  

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

కార్తి 'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్..(ఫొటోలు)

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు