ప్రపంచ జూనియర్‌ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌లో తన్వీ శర్మకు రజతం

Published on Mon, 10/20/2025 - 02:57

భారత యువ షట్లర్‌ తన్వీ శర్మ ప్రపంచ జూనియర్‌ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌లో రజత పతకం కైవసం చేసుకుంది. గువాహటిలో జరిగిన టోర్నీ మహిళల సింగిల్స్‌ ఫైనల్లో తన్వీ పరాజయం పాలైంది. ఆదివారం జరిగిన తుదిపోరులో టాప్‌ సీడ్‌ తన్వీ శర్మ 7–15, 12–15తో రెండో సీడ్‌ అన్యాపత్‌ ఫిచిత్‌ఫోన్‌ (థాయ్‌లాండ్‌) చేతిలో ఓడింది. ఈ మెగా ఈవెంట్‌ చరిత్రలో మహిళల సింగిల్స్‌లో భారత్‌ నుంచి అపర్ణ పోపట్‌ (1996లో రజతం), సైనా నెహ్వాల్‌ (2006లో రజతం, 2008లో స్వర్ణం) మాత్రమే పతకాలు గెలిచారు. 

మళ్లీ ఇప్పుడు 17 ఏళ్ల తర్వాత తన్వీ శర్మ ఆ జాబితాలో చోటు దక్కించుకుంది. మ్యాచ్‌ ఆరంభం నుంచే తన్వీ లయ కోల్పోయింది. ‘చాలా తప్పులు చేశా. మ్యాచ్‌ ప్రారంభం నుంచే తడబడ్డా. తొలి గేమ్‌ తర్వాత తేరుకొని... రెండో గేమ్‌లో గట్టి పోటీ ఇచ్చేందుకు ప్రయత్నించా. 8–5తో ఆధిక్యంలో ఉన్న సమయంలో చేసిన తప్పిదంతో థాయ్‌ షట్లర్‌కు పట్టుబిగించే  అవకాశం దక్కింది. ప్రత్యర్థి నా ఆటతీరును సులువుగా పట్టేసింది’ అని తన్వీ పేర్కొంది.  

Videos

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)