Breaking News

తన్వీ తడాఖా...

Published on Sat, 10/18/2025 - 04:06

గువాహటి: సుదీర్ఘ నిరీక్షణకు భారత యువ షట్లర్‌ తన్వీ శర్మ తెర దించించి. ప్రపంచ జూనియర్‌ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌ మహిళల సింగిల్స్‌ విభాగంలో 17 ఏళ్ల తర్వాత భారత్‌కు పతకాన్ని ఖాయం చేసింది. శుక్రవారం జరిగిన క్వార్టర్‌ ఫైనల్లో టాప్‌ సీడ్‌ తన్వీ శర్మ 13–15, 15–9, 15–10తో సాకి మత్సుమోటో (జపాన్‌)పై విజయం సాధించి సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. తద్వారా కనీసం కాంస్య పతకాన్ని ఖాయం చేసుకుంది. నేడు జరిగే సెమీఫైనల్లో లియు సి యా (చైనా)తో తన్వీ తలపడుతుంది. 

ఈ మెగా ఈవెంట్‌ చరిత్రలో మహిళల సింగిల్స్‌లో అపర్ణ పోపట్‌ (1996లో రజతం), సైనా నెహ్వాల్‌ (2006లో రజతం, 2008లో స్వర్ణం) మాత్రమే పతకాలు గెలిచారు. భారత్‌కే చెందిన మరో ప్లేయర్‌ ఉన్నతి హుడాకు నిరాశ ఎదురైంది. క్వార్టర్‌ ఫైనల్లో ఉన్నతి 12–15, 13–15తో అన్యాపత్‌ ఫిచిత్‌ఫోన్‌ (థాయ్‌లాండ్‌) చేతిలో ఓడిపోయింది. పురుషుల సింగిల్స్‌లో హైదరాబాద్‌ ప్లేయర్‌ టంకర తలశిల జ్ఞానదత్తుకు కూడా ఓటమి ఎదురైంది. జ్ఞానదత్తు 11–15, 13–15తో మూడో సీడ్‌ లియు యాంగ్‌ మింగ్‌ యు (చైనా) చేతిలో ఓడిపోయాడు. 

క్వార్టర్‌ ఫైనల్లో ఉన్నతి, జ్ఞానదత్తు గెలిచి ఉంటే ఈ ఇద్దరికి కూడా పతకాలు ఖాయమయ్యేవి. పురుషుల డబుల్స్‌ క్వార్టర్‌ ఫైనల్లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన అరిగెల భార్గవ్‌ రామ్‌–గొబ్బూరు విశ్వతేజ్‌ (భారత్‌) జంట 12–15, 10–15తో చెన్‌ జున్‌ టింగ్‌–లియు జున్‌ రోంగ్‌ (చైనా) జోడీ చేతిలో... మిక్స్‌డ్‌ డబుల్స్‌ క్వార్టర్‌ ఫైనల్లో భవ్య ఛాబ్రా–విశాఖ టొప్పో (భారత్‌) ద్వయం 9–15, 7–15తో హుంగ్‌ బింగ్‌ ఫు–చౌ యున్‌ ఆన్‌ (చైనీస్‌ తైపీ) జోడీ చేతిలో పరాజయం పాలై పతకాలకు దూరమయ్యాయి. 

Videos

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)