Breaking News

8 వికెట్లతో సత్తాచాటిన తనీష్‌.. ముంబైకి హ్యాట్రిక్‌ విజయం

Published on Thu, 10/29/2026 - 19:07

రంజీ ట్రోఫీ-2027 ఎలైట్ గ్రూప్-డిలో ముంబై జట్టు తమ ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. శరద్ పవార్ క్రికెట్ అకాడమీ వేదిక‌గా హ‌ర్యానాతో జ‌రిగిన మ్యాచ్‌లో ముంబై 10 వికెట్ల తేడాతో ఘ‌న విజ‌యాన్ని అందుకుంది. ఈ సీజ‌న్‌లో ముంబైకి ఇది వ‌రుస‌గా మూడో  విజ‌యం కావ‌డం గ‌మ‌నార్హం. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై త‌మ మొద‌టి ఇన్నింగ్స్‌లో 430 ప‌రుగుల భారీ స్కోర్ సాధించింది.

ముంబై ఇన్నింగ్స్‌లో అంగ్క్రిష్ రఘువంశీ(114), ముషీర్‌ ఖాన్‌(109) భారీ సెంచరీలతో కదం​ తొక్కారు. అనంతరం హర్యానా తమ తొలి ఇన్నింగ్స్‌లో 270 పరుగులకే ఆలౌటైంది.  ముంబై బౌలర్లలో ముషీర్‌ ఖాన్‌ 6 వికెట్లతో సత్తాచాటగా.. తనీష్‌ కొటియన్‌ మూడు వికెట్లు పడగొట్టాడు.

అయితే 160 ప‌రుగుల తేడాతో ఉండ‌డంతో  హ‌ర్యానాను ముంబై ఫాలో ఆన్  ఆడాల‌ని నిర్ణ‌యించింది. ఫాలో ఆన్‌లో కూడా హ‌ర్యానా ఆట తీరు ఏ మాత్రం మార‌లేదు. ముంబై స్పిన్నర్ తనీష్ కొటియన్ ఏకంగా 8 వికెట్లు పడగొట్టి హర్యానాను దెబ్బతీశాడు.

దీంతో హర్యానా జట్టు తమ రెండో ఇన్నింగ్స్‌లో 256 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో  ముంబై ముందు హర్యాని కేవలం 97 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని మాత్రమే ఉంచింది. ఈ లక్ష్యాన్ని ముంబై ఓపెనర్లు కేవలం 10.4 ఓవర్లలోనే వికెట్ నష్టపోకుండా ఊదిపడేశారు.

ఓపెనర్ ఆంగ్‌క్రిష్ రఘువంశీ హర్యానా బౌలర్లపై విరుచుకుపడుతూ కేవలం 29 బంతుల్లోనే అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. అతను మొత్తంగా 39 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్లతో 67 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. మరో ఓపెనర్ దివ్యాన్ష్ సక్సేనా 25 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 30 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఈ మ్యాచ్‌లో ఆల్‌రౌండ్‌షోతో అదరగొట్టిన ముషీర్ ఖాన్ ప్లేయర్ ఆఫ్‌ది మ్యాచ్‌గా నిలిచాడు.
 

Videos

చంద్రబబు డైవర్షన్ పాలిటిక్స్ పై.. పుత్తా శివశంకర్ స్ట్రాంగ్ కౌంటర్

చెవిరెడ్డి పరామర్శ

ప్రజలకు ప్రభుత్వం భారీ శుభవార్త.. తగ్గనున్న బియ్యం ధరలు..?

Ambati : అది ఆయన పర్సనల్.. నేను చెప్పాలనుకున్నది ఒక్కటే!

కళ్యాణదుర్గంలో YSRCP భారీ ర్యాలీ

MPP పదవి కోసం YSRCP MPTC పట్టాభిరామిరెడ్డి కిడ్నాప్

SBI సూపర్ స్కీమ్ ప్రతి నెలా రూ.60,000

బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న గాడ్జిల్లా! ఓవర్సీస్ లో రామాయణ కు గట్టి పోటీ

YSRCP ఎమ్మెల్సీల పిటిషన్లపై నేడు హై కోర్ట్ లో విచారణ

Alert: హైదరాబాద్ కు నీటి గండం.. డిసెంబర్ నుంచి తీవ్ర కష్టాలు..

Photos

+5

కుటుంబంతో కలిసి న‌భా న‌టేష్ దీపావ‌ళి సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

ఇంట్లోనే చాలా సింపుల్‌గా శ్రీలీల సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

దీపావళి స్పెషల్.. అక్కినేని కుటుంబమంతా ఒకేచోట (ఫొటోలు)

+5

అల్లు ఫ్యామిలీ దీపావళి సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

#Diwali2026 స్పెషల్ ఫొటోలు షేర్ చేసిన కృతి శెట్టి..(ఫోటోలు)

+5

ప్రమాదకర స్థాయికి వాయు కాలుష్యం...ఢిల్లీ ఉక్కిరి బిక్కిరి (ఫోటోలు)

+5

‘ఇట్లు అర్జున’ సినిమా మ్యూజికల్‌ లైవ్‌ కన్సర్ట్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

ఖైరతాబాద్‌లో ఘనంగా సదర్ ఉత్సవాలు (ఫోటోలు)

+5

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ స్టన్నింగ్‌ ఫోటోలు

+5

దివాళీ వేళ మెరిసిన తారలు (ఫోటోలు)