Breaking News

తన్మయ్‌ అగర్వాల్ సెంచ‌రీ.. హైద‌రాబాద్ ఘ‌న విజ‌యం

Published on Thu, 08/21/2025 - 08:11

చెన్నై: బుచ్చిబాబు ఇన్విటేషనల్‌ క్రికెట్‌ టోర్నమెంట్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌ హైదరాబాద్‌ జట్టు శుభారంభం చేసింది. పంజాబ్‌తో జరిగిన మూడు రోజుల మ్యాచ్‌లో నాలుగు వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. ఈ హోరాహోరీ పోరులో హైదరాబాద్‌ ఓపెనర్‌ తన్మయ్‌ అగర్వాల్‌ (127 బంతుల్లో 163; 12 ఫోర్లు, 5 సిక్స్‌లు) భారీ సెంచరీతో చెలరేగాడు.

పంజాబ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 90 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 348 పరుగులు చేయగా... హైదరాబాద్‌ తొలి ఇన్నింగ్స్‌లో 90 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 355 పరుగులు చేసింది. అనంతరం పంజాబ్‌ 39.5 ఓవర్లలో 298/8 వద్ద రెండో ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేసింది. 

కెప్టెన్ అన్‌మోల్‌ ప్రీత్‌ సింగ్‌ (55 బంతుల్లో 73; 3 ఫోర్లు, 5 సిక్స్‌లు), ప్రభ్‌సిమ్రన్‌ సింగ్‌ (48 బంతుల్లో 59; 5 ఫోర్లు, 3 సిక్స్‌లు), సలీల్‌ అరోరా (47 బంతుల్లో 68; 3 ఫోర్లు, 4 సిక్స్‌లు) అర్ధశతకాలతో రాణించడంతో పంజాబ్‌ జట్టు వేగంగా పరుగులు సాధించింది.

హైదరాబాద్‌ బౌలర్లలో రవితేజ 3 వికెట్లు పడగొట్టగా... తనయ్, నిశాంత్‌ చెరో 2 వికెట్లు తీశారు. అనంతరం 292 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన హైదరాబాద్‌ జట్టు 41 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 294 పరుగులు చేసి గెలిచింది. తన్మయ్‌కు హిమతేజ (44 బంతుల్లో 50; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) సహకరించాడు.
చదవండి: ఆసియాక‌ప్ జ‌ట్టులో నో ఛాన్స్‌.. పాకిస్తాన్‌ కెప్టెన్‌ కీల‌క నిర్ణ‌యం 

Videos

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)