చికిత ‘పసిడి’ గురి 

Published on Tue, 12/09/2025 - 04:39

తైపీ ఓపెన్‌ వరల్డ్‌ సిరీస్‌ ఇండోర్‌ ఆర్చరీ టోర్నమెంట్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన తెలంగాణ అమ్మాయి తానిపర్తి చికిత స్వర్ణ పతకాన్ని సాధించింది. మహిళల 
అండర్‌–21 కాంపౌండ్‌ వ్యక్తిగత విభాగంలో పెద్దపల్లి జిల్లాకు చెందిన 20 ఏళ్ల చికిత చాంపియన్‌గా అవతరించింది. చైనీస్‌ తైపీలోని తావోయువాన్‌ సిటీలో జరిగిన ఈ టోరీ్నలో చికిత ఫైనల్లో 148–141 పాయింట్ల తేడాతో జిట్‌మున్‌ ఖెమనిత్‌ (థాయ్‌లాండ్‌)పై గెలుపొందింది.

 సెమీఫైనల్లో చికిత 147–145తో యోన్‌సియో కాంగ్‌ (దక్షిణ కొరియా)పై, క్వార్టర్‌ ఫైనల్లో 149–138తో సియోయూన్‌ కాంగ్‌ (దక్షిణ కొరియా)పై విజయం సాధించింది. మరోవైపు మహిళల కాంపౌండ్‌ వ్యక్తిగత విభాగంలో భారత స్టార్, ఆంధ్రప్రదేశ్‌ క్రీడాకారిణి వెన్నం జ్యోతి సురేఖ కాంస్య పతకాన్ని దక్కించుకుంది. కాంస్య పతక మ్యాచ్‌లో జ్యోతి సురేఖ 149–143తో సో చేవన్‌ (దక్షిణ కొరియా)పై నెగ్గింది. 

పురుషుల కాంపౌండ్‌ వ్యక్తిగత విభాగంలో అభిషేక్‌ వర్మ కూడా కాంస్యం కైవసం చేసుకున్నాడు. కాంస్య పతక మ్యాచ్‌లో అభిషేక్‌ వర్మ 148–146తో మార్కో బ్రునో (ఇటలీ)పై గెలిచాడు. మహిళల రికర్వ్‌ అండర్‌–21 కాంస్య పతక మ్యాచ్‌లో ఆంధ్రప్రదేశ్‌ ప్లేయర్‌ కొండపావులూరి యుక్తశ్రీ 5–6తో షు యాన్‌ లిన్‌ (చైనీస్‌ తైపీ) చేతిలో ఓడిపోయింది.  

Videos

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)