Breaking News

T20 WC 2023: ఆసీస్‌తో సెమీస్‌కు ముందు టీమిండియాకు భారీ షాక్‌!

Published on Thu, 02/23/2023 - 14:19

ICC Womens T20 World Cup 2023: ఐసీసీ మహిళా టీ20 ప్రపంచకప్‌-2023 సెమీస్‌ మ్యాచ్‌కు ముందు టీమిండియాకు బ్యాడ్‌న్యూస్‌! కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌కౌర్‌, ఆల్‌రౌండర్‌ పూజా వస్త్రాకర్‌ కీలక టీ20కి దూరమైనట్లు సమాచారం. అనారోగ్య కారణాల వల్ల వీరిద్దరు గురువారం(ఫిబ్రవరి 23) నాటి మ్యాచ్‌కు అందుబాటులో ఉండకపోవచ్చని ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ తన కథనంలో పేర్కొంది.

కాగా వరల్డ్‌కప్‌-2023 తొలి సెమీ ఫైనల్లో భాగంగా టీమిండియా- ఆస్ట్రేలియాతో తలపడనుంది. పటిష్ట కంగరూ జట్టును ఓడించి టైటిల్‌ గెలిచే దిశగా మరో ముందడుగు వేయాలని పట్టుదలగా ఉంది. గతంలో రెండు కీలక సందర్భాల్లో తమను ఓడించిన ఆసీస్‌కు సెమీస్‌లోనే చెక్‌ పెట్టాలన్న తలంపుతో ఉంది భారత మహిళా జట్టు.

అస్వస్థతకు గురై
ఈ క్రమంలో హర్మన్‌, పూజ అనారోగ్యం బారిన పడటం ఆందోళన రేకెత్తించింది. అస్వస్థతకు గురై బుధవారం ఆస్పత్రిలో చేరిన వీరిద్దరు డిశ్చార్జ్‌ అయినప్పటికీ మ్యాచ్‌ ఆడతారా లేదా అన్న విషయం ప్రశ్నార్థకంగా మారింది.

కాగా కెప్టెన్‌ హర్మన్‌ వరల్డ్‌కప్‌ తాజా ఎడిషన్‌లో నాలుగు మ్యాచ్‌లలో కలిపి 66 పరుగులు చేసింది. ఒకవేళ ఆమె జట్టుకు దూరమైతే యస్తికా భాటియా తుది జట్టులో చోటు దక్కించుకునే అవకాశం ఉంది. మరోవైపు.. ఆల్‌రౌండర్‌ పూజా వస్త్రాకర్‌ స్థానంలో దేవిక వైద్య ఆడే ఛాన్స్‌ ఉంది. హర్మన్‌ ఆడనట్లయితే వైస్‌ కెప్టెన్‌ స్మృతి మంధాన కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టనుంది.

టీ20 వరల్డ్‌కప్‌-2023 తొలి సెమీ ఫైనల్‌- తుది జట్లు (అంచనా) 
భారత్‌: స్మృతి మంధాన, షఫాలీ, రిచా ఘోష్, జెమీమా రోడ్రిగ్స్, దీప్తి శర్మ, శిఖా పాండే, రాజేశ్వరి గైక్వాడ్, రాధా యాదవ్‌, రేణుక, యస్తికా భాటియా, దేవికా వైద్య. 

ఆస్ట్రేలియా: మెగ్‌ లానింగ్‌ (కెప్టెన్‌), బెత్‌ మూనీ, అలీసా హీలీ, ఎలీస్‌ పెర్రీ, ఆష్లే గార్డ్‌నర్, తాలియా మెక్‌గ్రాత్, గ్రేస్‌ హారిస్, జార్జియా, అలానా కింగ్, మేగన్‌ షుట్, డార్సీ బ్రౌన్‌. 

చదవండి: మహ్మద్‌ రిజ్వాన్‌ విధ్వంసకర శతకం.. 18 బంతుల్లోనే..!
BGT 2023: ఆసీస్‌తో సిరీస్‌.. టీమిండియా క్రికెటర్‌ తండ్రి కన్నుమూత

Videos

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)