Breaking News

T20 World Cup 2024, SA vs BAN: బంగ్లాదేశ్‌ కొంపముంచిన అంపైర్‌

Published on Tue, 06/11/2024 - 15:27

ఇటీవలికాలంలో క్రికెట్‌లో ఫీల్డ్‌ అంపైర్ల తప్పిదాలు చాలా ఎక్కువయ్యాయి. అంపైర్ల తప్పుడు నిర్ణయాల కారణంగా చాలా జట్లు గెలవాల్సిన మ్యాచ్‌ల్లో ఓటమిపాలవుతున్నాయి. తాజాగా ఇలాంటి ఘటనే మరోసారి రిపీటైంది. టీ20 వరల్డ్‌కప్‌ 2024లో భాగంగా సౌతాఫ్రికా-బంగ్లాదేశ్‌ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఫీల్డ్‌ అంపైర్‌ సామ్‌ నొగాస్కీ తప్పుడు నిర్ణయం బంగ్లాదేశ్‌ ఓటమికి పరోక్ష కారణమైంది.

సౌతాఫ్రికా నిర్ధేశించిన 114 పరుగుల లక్ష్య ఛేదనలో (ఇన్నింగ్స్‌ 17వ ఓవర్‌లో) ఈ తప్పిదం​ జరిగింది. సౌతాఫ్రికా బౌలర్‌ బార్ట్‌మన్‌ ఓట్నీల్‌ వేసిన బంతిని బంగ్లా బ్యాటర్‌ మహ్మదుల్లా లెగ్‌సైడ్‌ దిశగా ఆడే ప్రయత్నం చేయగా.. బంతి ప్యాడ్‌లకు తాకి బౌండరీకి వెళ్లింది. సౌతాఫ్రికా ఆటగాళ్లు ఎల్బీడబ్ల్యూకు అప్పీల్‌ చేయడంతో అంపైర్‌ నొగాస్కీ ఔట్‌గా ప్రకటించాడు.

అంపైర్‌ నిర్ణయం పట్ల అసంతృప్తి వ్యక్తం చేసిన మహ్మదుల్లా రివ్యూకి వెళ్లగా నాటౌట్‌గా తేలింది. ఐసీసీ నిబంధనల ప్రకారం ఫీల్డ్‌ అంపైర్‌ నిర్ణయం తీసుకోగానే బంతి డెడ్‌ బాల్‌గా మారుతుంది. ఈ కారణంగా మహ్మదుల్లాను ఔట్‌గా ప్రకటించిన బంతి బౌండరీకి వెళ్లినా బంగ్లా స్కోర్‌కు కౌంట్‌ కాలేదు. 

ఫైనల్‌గా చూస్తే ఇదే నాలుగు పరుగుల తేడాతో బంగ్లాదేశ్‌ ఓటమిపాలైంది. మ్యాచ్‌ అనంతరం బంగ్లా ఆటగాడు తౌహిద్‌ హ్రిదోయ్‌ ఫీల్డ్‌ అంపైర్‌ సామ్‌ నొగాస్కీ నిర్ణయాన్ని తప్పుబట్టాడు. నొగాస్కీ కరెక్ట్‌గా తన నిర్ణయాన్ని ప్రకటించి ఉంటే ఫలితం తమకు అనుకూలంగా వచ్చేదని అన్నాడు. 

కాగా, ఇదే మ్యాచ్‌లో హ్రిదోయ్‌ను ఔట్‌గా ప్రకటించిన తీరుపై కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రబాడ బౌలింగ్‌లో అనుమానాస్పద రివ్యూకు హ్రిదోయ్‌ ఔట్‌గా ప్రకటించబడ్డాడు.

స్కోర్ల వివరాలు..

సౌతాఫ్రికా-113/6 (క్లాసెన్‌ 46; తంజిబ్‌ హసన్‌ సకీబ్‌ 3/18)

బంగ్లాదేశ​- 109/7 (తౌహిద్‌ హ్రిదోయ్‌ 37; కేశవ్‌ మహారాజ్‌ 3/27)

4 పరుగుల తేడాతో సౌతాఫ్రికా విజయం

Videos

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

ఆళ్లగడ్డలో ఉద్రిక్తత.. ఇద్దరు ప్రపోజర్లు కిడ్నాప్

దీపావళి తర్వాత మూతపడనున్న పెట్రోల్ బంకులు? కారణం ఇదుకే..!

ప్రొద్దుటూరులో హై టెన్షన్.. రాచమల్లు, YSRCP నేతలపై లాఠీ ఛార్జ్

గుత్తిలో కౌన్సిలర్ల నామినేషన్లకు అడ్డంకులు.. శివంగిలా ఎదురెళ్లి ఇచ్చిపడేసిన నైరుతి రెడ్డి

150 కుటుంబాలు TDPకి బై బై.. విజయనగరంలో బాబుకు బిగ్ షాక్

విజయవాడ మేయర్ నాదే.. రాయన భాగ్యలక్ష్మి వైరల్ కామెంట్స్

మీ కంటే YSRCP నయం.. 40 సంవత్సరాలు TDPకి పని చేసినందుకు మీరు నాకు ఇచ్చిన గిఫ్ట్ ఇదా..!

లక్షకు 42 లక్షల లాభం.. రాకెట్ లా దూసుకెళ్తున్న షేర్

ఫై దుబాయ్ ఘటనలో.. భయానక అనుభవాలు.. బయటపెట్టిన పైలట్ స్మిత్ మచ్చర్

Photos

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)