ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం
Breaking News
ఆకట్టుకుంటున్న ఉన్ని కృష్ణన్ టీ20 ప్రపంచకప్ గీతం
Published on Mon, 02/02/2026 - 11:31
ప్రముఖ గాయకులు ఉన్నీ కృష్ణన్, పాలఘాట్ ఆర్. రాంప్రసాద్, సిక్కిల్ గురుచరణ్ ఆలపించిన టీ20 ప్రపంచకప్ 2026 గీతం క్రికెట్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. 2023 వన్డే ప్రపంచకప్ కోసం వీరు రూపొందించిన Cricket Endraal Bharatham అనే గీతానికి ఇది ఎక్స్‌టెన్షన్‌గా గత నెలలో (జనవరి) విడుదలైంది.
T20 వెర్షన్ 2.0 పేరిట విడుదలైన తాజా గీతం సోషల్‌మీడియాలో విశేషమైన ప్రజాదరణ పొందుతుంది. 2023లో విడుదలైన వెర్షన్ కూడా క్రికెట్ ఫ్యాన్స్‌ను ఊర్రూతలూగించింది. కర్ణాటక శైలిలోని సాగే తాజా గీతం దేశవ్యాప్తంగా మంచి ఆదరణ పొందుతోంది.
గీతం ప్రత్యేకతలు
- 2.0 వెర్షన్లో తాజా సాహిత్యం మరియు సరికొత్త స్వరరచనను ఉపయోగించారు.
- T20 క్రికెట్‌కి తగిన ఉత్సాహభరితమైన, వేగవంతమైన సంగీత నోట్స్‌తో పాటను తీర్చిదిద్దారు.
- కర్ణాటక రాగాల సౌందర్యాన్ని ఆధునిక తాళాలతో మేళవించి, క్రికెట్ ఉత్సాహాన్ని ప్రతిబింబించేలా ఈ గీతాన్ని రూపొందించారు.
జాతీయ స్పూర్తి
ఈ గీతం కేవలం సంగీత కృషి మాత్రమే కాదు, దేశభక్తి, క్రికెట్ పట్ల ఉన్న ప్రేమను ప్రతిబింబించే సాంస్కృతిక ఉత్సవం. టీ20 ఫార్మాట్లో భారత జట్టు విజయాన్ని ఆకాంక్షిస్తూ, అభిమానుల్లో ఉత్సాహాన్ని రగిలించేందుకు ఈ గీతం రూపొందించబడింది.
కాగా, టీ20 ప్రపంచకప్ 2026 కోసం అధికారిక గీతం కూడా రూపొందిచబడింది. ఈ గీతాన్ని ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్ స్వరపరిచాడు. Feel the thrill పేరిట సాగే ఈ గీతం కూడా క్రికెట్ అభిమానులను ఉర్రూతలూగిస్తుంది. టీ20 ప్రపంచకప్ ఓపెనింగ్ సెర్మనీలో ఈ గీతాన్ని ప్రత్యేకంగా ఆలపించనున్నారు. మెగా టోర్నీ భారత్, శ్రీలంక వేదికలుగా ఫిబ్రవరి 7 నుంచి ప్రారంభం కానున్న విషయం తెలిసిందే.
Tags : 1