Breaking News

న్యూజిలాండ్‌-భార‌త్ ఫైన‌ల్‌.. టిక్కెట్ ధ‌ర ఎన్ని ల‌క్ష‌లంటే?

Published on Sun, 03/08/2026 - 18:19

టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌-2026 ఫైన‌ల్లో అహ్మ‌దాబాద్ వేదిక‌గా భార‌త్‌-న్యూజిలాండ్ జ‌ట్లు త‌ల‌ప‌డేందుకు సిద్ద‌మ‌య్యాయి. ఈ  తుది పోరును వీక్షించేందుకు అభిమానులు పెద్ద ఎత్తున నరేంద్ర మోడీ స్టేడియం వ‌ద్ద‌కు చేరుకుంటున్నారు. అహ్మదాబాద్‌ ప్రస్తుతం 'క్రికెట్ ఫీవర్'తో ఊగిపోతోంది. ఇప్ప‌టికే ఈ మ్యాచ్‌కు సంబంధించిన టిక్కెట్లు మొత్తం అమ్ముడుపోయాయి.

బుక్‌మై షో యాప్ ద్వారా టికెట్లను విక్ర‌యించారు. ప్రారంభ టిక్కెట్ ధ‌ర రూ. 2 వేలు కాగా.. గ‌రిష్ట ధ‌ర రూ. 75000గా నిర్ణ‌యించారు. అయితే టిక్కెట్లు దొరకని అభిమానుల‌ను ధ‌ళారులు టార్గెట్ చేస్తున్నారు.బ్లాక్ మార్కెట్‌లో ఒక్కో టిక్కెట్‌ను రూ. 2 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ విష‌యంపై గుజరాత్ క్రికెట్ అసోసియేషన్ (GCA) కార్యదర్శి అనిల్ పటేల్ స్పందించారు. గుజరాత్ క్రికెట్ అసోసియేషన్ ఎలాంటి ఫిజికల్ టిక్కెట్లను విక్రయించడం లేదని, కేవలం బుక్‌మైషో యాప్ ద్వారానే అధికారిక బుకింగ్స్ జరుగుతాయని స్పష్టం చేశారు. 

అడ్డ‌దారుల్లో టిక్కెట్లు కొనవద్దని ఆయన హెచ్చరించారు.కేవలం టిక్కెట్లే కాదు, అహ్మదాబాద్, గాంధీనగర్ న‌గ‌రాల్లో హోటల్ గదుల ధరలు కూడా ఆకాశాన్నంటాయి. సాధారణంగా అహ్మదాబాద్ హోట‌ల్లో ఒక రోజుకు ధ‌ర‌ రూ. 4,000గా ఉంటుంది. కానీ ఇప్పుడు ఫైన‌ల్ మ్యాచ్ క్రేజ్‌ కార‌ణంగా ఈ ధరలు ఏకంగా 10 రెట్లు పెరిగాయి. అంటే ఒక్క రోజుకు రూ.40,000 పైగా వసూలు చేస్తున్నారు.

 

Videos

భువనగిరిలో ఉద్రిక్తత ఎమ్మెల్యే, సీఎం రేవంత్ ఫ్లెక్సీపై నల్ల రంగు

పుష్ప శ్రీవాణి పై అంత నీచంగా ప్రవర్తిస్తారా? పోలీసుల ఓవర్ యాక్షన్... వరుదు కళ్యాణి అరెస్ట్

సుప్రీం కోర్టు కీలక నిర్ణయం..CJP నిరసనకారుల FIRలు రద్దు

పవన్ కళ్యాణ్ బర్త్ డే ఫ్లెక్సీ..జనసేన,టీడీపీ మధ్య కొట్లా

అడ్డంగా పడుకుని నీ పబ్లిసిటీ స్టంట్లు.. చంద్రబాబును ఏకిపారేసిన జడ శ్రవణ్

ఒకే ఇంట్లో 23 మృతదేహాలు 1000కి చేరిన మృతులు

YS జగన్ కు ఘన స్వాగతం

AP: మేము అస్సలు తగ్గం..! పల్లె-పల్లెకు రైతులతో వంట వార్పు కార్యక్రమం

ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కుమారుడు అరెస్ట్

కొబ్బరికాయ కొట్టేస్తా. గుమ్మడికాయ కట్టేస్తా.. అప్పనంగా క్రెడిట్ నొక్కేస్తా...

Photos

+5

మెరుపుతీగలా మారిపోయిన హెబ్బా పటేల్ (ఫొటోలు)

+5

తమిళ బ్యూటీ ఆండ్రియా పారిస్ ట్రిప్ (ఫొటోలు)

+5

హీరోగా రవితేజ తమ్ముడి కొడుకు.. 'మారెమ్మ' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

అనిరుధ్ కన్సర్ట్ కోసం జోనితా గాంధీ రెడీ అయిందిలా (ఫొటోలు)

+5

కీర్తి సురేశ్ కలర్‌ఫుల్ ఓనం సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

యాపిల్ సీఈఓగా 15ఏళ్లు.. టిమ్ కుక్ అరుదైన (ఫోటోలు)

+5

పార్వతీపురం మన్యం జిల్లా...శిఖపరువులో జలసవ్వడి (ఫొటోలు)

+5

యుగానికొక్కడు.. మెస్సీ అరుదైన జ్ఞాపకాలు! (ఫొటోలు)

+5

‘ఐ యామ్‌ గేమ్‌’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌...ముఖ్య అతిథిగా నాగ్‌ అశ్విన్‌ (ఫొటోలు)

+5

కొత్త సినిమా ‘వేట’ ప్రారంభోత్సవం (ఫొటోలు)