Breaking News

టీ20 వరల్డ్‌కప్‌ వార్మప్‌ మ్యాచ్‌లు షురూ

Published on Tue, 05/28/2024 - 14:32

టీ20 వరల్డ్‌కప్‌ 2024 మ్యాచ్‌లు నిన్నటి (మే 27) నుంచి ప్రారంభమయ్యాయి. పసికూనల మధ్య పోటీలతో మహాసంగ్రామం రిహార్సల్స్‌ మొదలయ్యాయి. తొలి మ్యాచ్‌లో కెనడా-నేపాల్‌.. రెండో మ్యాచ్‌లో పపువా న్యూ గినియా-ఒమన్‌.. మూడో పోటీలో ఉగాండ-నమీబియా జట్లు తలపడ్డాయి.

నేపాల్‌కు షాకిచ్చిన కెనడా
నేపాల్‌తో జరిగిన మ్యాచ్‌లో కెనడా 63 పరుగుల తేడాతో గెలుపొందింది. డల్లాస్‌ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన కెనడా నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది. 

నికోలస్‌ కిర్టన్‌ (52), రవీందర్‌పాల్‌ సింగ్‌ (41 నాటౌట్‌) రాణించారు. 184 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన నేపాల్‌.. డిల్లన్‌ హెలిగర్‌ (4/20) ధాటికి 19.3 ఓవర్లలో 120 పరుగులకే ఆలౌటైంది. నేపాల్‌ ఇన్నింగ్స్‌లో కుశాల్‌ మల్లా (37) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు.

పపువా న్యూ గినియాపై విజయం సాధించిన ఒమన్‌
పపువా న్యూ గినియాతో జరిగిన మ్యాచ్‌లో ఒమన్‌ 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన గినియా నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 137 పరుగులు చేయగా.. ఒమన్‌ మరో 5 బంతులు మిగిలుండగానే విజయతీరాలకు చేరింది. జీషన్‌ మక్సూద్‌ బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్‌ (45) ఆడి ఒమన్‌ను గెలిపించాడు.

ఉగాండను చిత్తు చేసిన నమీబియా
నిన్న జరిగిన మూడో వార్మప్‌ మ్యాచ్‌లో ఉగాండను నమీబియా 5 వికెట్ల తేడాతో చిత్తు చేసింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన ఉగాండ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 134 పరుగులు చేయగా..నమీబియా 18.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. నికోలాస్‌ డేవిన్‌ మెరుపు అర్దసెంచరీ (54) చేసి నమిబీయాను గెలిపించాడు.

ఇవాళ (మే 28) జరుగబోయే వార్మప్‌ మ్యాచ్‌ల వివరాలు..

  • శ్రీలంక వర్సెస్‌ నెదర్లాండ్స్‌- ఫ్లోరిడా వేదికగా జరుగబోయే ఈ మ్యాచ్‌ భారతకాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు ప్రారంభమవుతుంది.

  • బంగ్లాదేశ్‌ వర్సెస్‌ యూఎస్‌ఏ- డల్లాస్‌ వేదికగా జరుగబోయే ఈ మ్యాచ్‌ భారతకాలమానం ప్రకారం రాత్రి 9 గంటలకు ప్రారంభమవుతుంది.

  • ఆస్ట్రేలియా వర్సెస్‌ నమీబియా- ట్రినిడాడ్‌ వేదికగా జరుగబోయే ఈ మ్యాచ్‌ భారతకాలమానం ప్రకారం మే 29 తెల్లవారుజామున 4:30 గంటలకు మొదలవుతుంది.

టీమిండియా తమ తొలి వార్మప్‌ మ్యాచ్‌ను జూన్‌ 1న ఆడుతుంది. న్యూయార్క్‌లో జరిగే ఆ మ్యాచ్‌లో టీమిండియా బంగ్లాదేశ్‌తో తలపడుతుంది.

 

 

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)