Breaking News

T20 World Cup 2024: న్యూజిలాండ్‌ స్టార్‌ పేసర్‌కు మందలింపు

Published on Fri, 06/14/2024 - 21:55

టీ20 వరల్డ్‌కప్‌ 2024లో భాగంగా వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌ సందర్భంగా ఐసీసీ నియమావళిని ఉల్లఘించినందుకు గానూ న్యూజిలాండ్‌ స్టార్‌ పేసర్‌ టిమ్‌ సౌథీ మందలింపుకు గురయ్యాడు. ఈ మ్యాచ్‌లో సౌథీ ఔటయ్యాక డ్రెస్సింగ్‌ రూమ్‌కి వెళ్తూ  హ్యాండ్ శానిటైజర్ డిస్పెన్సర్‌ను పగులగొట్టాడు. 

ఐసీసీ కోడ్‌ ఆఫ్‌ కాండక్ట్‌ నిబంధనల ప్రకారం​ అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో గ్రౌండ్ పరికరాలను ధ్వంసం చేస్తే ఆర్టికల్ 2.2 ఉల్లంఘన కింద ఆటగాళ్లపై చర్యలు తీసుకుంటారు. ఐసిసి ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు గాను సౌథీ స్వల్ప మందలింపుకు గురి కావడంతో పాటు ఓ డీమెరిట్‌ పాయింట్‌ పొందాడు. గడిచిన 24 నెలల్లో సౌథీకి ఇది మొదటి ఉల్లంఘణ కావడంతో ఐసీసీ మందలింపుతో వదిలి పెట్టింది. సౌథీ తన తప్పిదాన్ని మ్యాచ్‌ రిఫరీ డేవిడ్‌ బూన్‌ ముందు అంగీకరించాడు.

ఇదిలా ఉంటే, టీ20 వరల్డ్‌కప్‌ 2024లో న్యూజిలాండ్‌ ప్రస్తానం ముగిసింది. ఆ జట్టు మరో రెండు మ్యాచ్‌లు ఆడాల్సి ఉండగానే టోర్నీ నుంచి నిష్క్రమించింది. వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓడటంతో న్యూజిలాండ్‌ అధికారికంగా టోర్నీ నుంచి వైదొలిగింది. న్యూజిలాండ్‌ అంతకుముందు ఆఫ్ఘనిస్తాన్‌ చేతిలో ఓటమిపాలైంది. న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన వెస్టిండీస్‌ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేయగా..ఛేదనలో చేతులెత్తేసిన న్యూజిలాండ్‌ నిర్ణీత ఓవర్లు​ పూర్తయ్యేసరికి లక్ష్యానికి 14 పరుగుల దూరంలో నిలిచిపోయి ఓటమిపాలైంది.

Videos

టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. లారెన్స్ బిష్ణోయ్ సంచలన ప్రకటన

వైఎస్సార్ జిల్లాలో ఉద్రిక్తత.. YSRCP ఛైర్మన్ అభ్యర్థి పోరెడ్డి ఇంటిపై టీడీపీ దాడి

జియో IPO సంచలనం

బాబుకు దిమ్మతిరిగేలా.. పక్కా ఆధారాలతో SECకి ఫిర్యాదు

రెండో టీ20లో భారత మహిళా జట్టు విజయం

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)